ప్రశాంత రెడ్డి కాదు … ఇక మీరు విశ్రాంత రెడ్డే.
** మంత్రి గా ఉండి ఆ మాటలేంటి..?
** మండిపడిన షర్మిళ పీఏ రవీందర్ రెడ్డి
(కూసుమంచి-విజయం న్యూస్)
ప్రశాంత రెడ్డి కాదు … ఇక మీరు విశ్రాంత రెడ్డే అని వైఎస్ఆర్ టీపీ షర్మిళ పీఏ రవీందర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలం పర్యటించిన రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల వీరేశం సంచలన వ్యాఖ్యలు చేయడం పట్ల షర్మిళ పీఏ రవీందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.ఓటు సిరా ఆరక ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గోడ దూకించుకున్న మీ మాటలకు అర్ధాలున్నాయా..? అని ప్రశ్నించారు.
Allso read:- ‘పాలేరు’ రేసులో మరో ఇద్దరు..?
వైయస్ కుటుంబం ఎవరి ఏజంటుగా రావాల్సిన పనిలేదని, ప్రకటనకే మీ పార్టీ వారికి చమటలు పడితే, రానున్న రోజులలో మీ మానసిక స్థితి ఎలా ఉంటదో అర్థమవుతుందని అన్నారు.ఖమ్మం రూరల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైయస్ షర్మిల వ్యక్తిగత సహాయకుడు నంద్యాల రవీందర్ రెడ్డి ఆరోపించారు.