Telugu News

సత్తుపల్లి పై షర్మిల బాణం.

గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న మాజీ మంత్రి శిష్యురాలు

0

సత్తుపల్లి పై షర్మిల బాణం.

== రంగంలోకి ఓ మహిళ నేత

==  గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న మాజీ మంత్రి శిష్యురాలు

== ఇక నుంచి ప్రచారం… శివరాత్రి ముహుర్తం.. ముమ్మర ఏర్పాట్లు

ఎందరో మహానాయకులు బరిలో నిలిచి గెలిచిన నియోజవకర్గంలో తొలిసారిగా మహిళ నేత బరిలో నిలిచేందుకు సై అంటోంది.. పక్క రాష్ట్ర పార్టీలో గెలిచి, అధికార పార్టీలో చేరి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులందరికి చైర్మన్ గా పనిచేసిన ఆమె, ఓ మహిళ ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీలో ఇటీవలే చేరింది. ఆ తరువాత సత్తుపల్లి నుంచి పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని అధినేత్రికి చెప్పిన వెంటనే అంగీకరించగా, అతి త్వరలోనే ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకున్న ఆ మహిళ నేత వరసగా మూడు సార్లు హ్యాట్రిక్ విజయం సాధించి, నాల్గొవ సారి కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే పై పోటీ చేసేందుకు సై అంటోంది.. ఆమె ఎవరు.?? ఎక్కడ నుంచి వచ్చారు..? అక్కడే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారో..? విజయం ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం ఇది.

ఖమ్మంప్రతినిధి, జనవరి 13 (విజయంన్యూస్) :-

రాష్ట్రంలోని నియోజకవర్గాలలో సత్తుపల్లికి ప్రత్యేక స్థానం ఉంది…ఖమ్మం జిల్లాకే తలమానకమైన నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గం… ఎందరో మహానీయులను అందించిన ఆ నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు, జలగంప్రసాద్ రావు, తుమ్మల నాగేశ్వరరావు లాంటి రాజకీయ మేథావులను అందించిన నేల ఇది. ఆ నేల ప్రస్తుతం పునర్వీభజనలో ఎస్సీ రిజర్వేషన్ కావడంతో బయట నియోజకవర్గ వ్యక్తులకు ప్రాథాన్యతనిచ్చింది.. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానిదే  అధిపత్యం ఎక్కువ ఉంటుంది. విభిన్న సంస్థృతుల గుమ్మంగా రాజకీయ చిత్రపటంలో చోటు కలిగి ఉంది. తూర్పు, పశ్చిమ కృష్ణాజిల్లాలకు సరిహద్దుగానూ ఖమ్మం జిల్లాకు మొదటి నియోజక వర్గంగా ఏర్పడింది. సత్తుపల్లి ప్రజలకు పక్కజిల్లాల సంస్థృతి, సంప్రదాయాలతో తగినంత సత్సంభందాలను కలిగివుంటుంది.

allso read- పాలేరు ప్రజలకు ‘షర్మిళ’ బంపర్ ఆఫర్

1952 వరకు వేంసూరు నియోజకవర్గంగా వున్న ఈ ప్రాంతం ఆ తరువాత నైసర్గిక స్వరూపం ప్రాతిపదిక ఆధారంగా సత్తుపలి నియోజకవర్గంగా ఏర్పడింది. భౌగోళికం గానూ, చార్రితకంగానూ, రాజకీయం గానూ మొదటినుంచి ప్రత్యేకతలను చాటుకుంటోంది. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్యం వరకు నియోజకవర్గ చరిత్ర స్ఫూర్తిదాయకంగా వుంటుంది. తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాల సమ్మేళనంతో అధికశాతం అటవీ ప్రదేశం కలిగిన నియోజకవర్గంగా ఉంది. రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా దేశంలో గుర్తింపు పొందిన సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు గణనీయమైన అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న సత్తుపల్లి నియోజకవర్గంలో జలగం వెంగళరావు, జలగం ప్రసాద్ రావు, జలగం వెంకట్రావులు విజయం సాధించారు. ఒక కుటుంబానికే పరిమితమైన ఆ నియోజకర్గంలో తుమ్మల నాగేశ్వరరావు షాక్ ఇచ్చారు. ఆ తరువాత మళ్లి ఓటమి చెందినప్పటికి తిరిగి వరసగా తుమ్మల గెలవడంతో నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం పార్టీగా మారిపోయింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న సత్తుపల్లి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారింది.. ఇప్పటి వరసగా మూడు సార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 1994 నుంచి 2018 ఎన్నికల వరకు ఆరు సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హావ్వా కొనసాగుతున్న సందర్భంలో గెలిచింది మినహా, కాంగ్రెస్ గెలుచుకోలేదు. దీంతో సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది. అలాంటి నియోజకవర్గంలో రాజన్న రాజ్యం పేరుతో రాజకీయ రణరంగంలోకి వస్తున్న వైఎస్ షర్మిళ పార్టీ తరుపున ఓ మహిళ నేత పోటీ చేసేందుకు సై అంటోంది.. ఆమెది ఈ జిల్లా కాకపోయినప్పటికి సమీప నియోజకవర్గం కావడం, జిల్లా ప్రజలకు మంచి పరిచయాలు ఉండటంతో సత్తుపల్లి లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అందుకు గాను పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ సంపూర్ణ మద్దుతు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నది.

== మాజీ మంత్రికి శిష్యురాలిగా గుర్తింపు

ఆమె మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు శిష్యురాలు. 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన తుమ్మల నాగేశ్వరరావు 2015లో తెలుగుదేశ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరగా, అప్పుడు కూడా ఆమె చేరింది. ఆ తరువాత ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికైయ్యారు. ఆమె ఎవరంటే..?

allso read- బీఆర్ఎస్ కు కోరం గుడ్ బై..?

గడిపల్లి కవితా. తుమ్మల నాగేశ్వరావుతో పాటు 2015 నుంచి 2021వరకు తుమ్మల నాగేశ్వరరావుతో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆమె ఎవరు ఊహించని విధంగా వైఎస్ షర్మిళ నూతనంగా ఏర్పాటుచ సిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అవిర్భావ సభలో ఖమ్మంలో ఆమె ఆ పార్టీలో చేరారు. అనంతరం 2022లో ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్ గా వైఎస్ షర్మిళ, గడిపల్లి కవితాను నియమించారు. ఆమె ప్రస్తుతం వైఎస్ఆర్ టీపీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ గా  పనిచేస్తున్నారు.

== శివరాత్రి నుంచి ప్రచారం షురూ..

వైఎస్ఆర్ టీపీలో చేరిన అనంతరం సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ చార్జ్ బాధ్యతలు తీసుకున్న గడిపల్లి కవితా ఆ తరువాత సత్తుపల్లి నియోజవర్గంలో చేపట్టిన అనేక కార్యక్రమాలకు ఆమె హాజరైయ్యారు. ఉమ్మడి జిల్లాకు కోఆర్డినేటర్ గా బాధ్యతలు తీసుకున్న ఆమె ఒక వైపు పార్టీని బలోపేతం చేస్తూనే, మరో వైపు సత్తుపల్లి నియోజకవర్గంలో అడపదడపా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అయితే వైఎస్ఆర్ టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించగా, సత్తుపల్లి నుంచి గడిపల్లి కవితాను రంగంలోకి దింపేందుకు షర్మిళ గ్రిన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆమె శివరాత్రి ముహుర్తంగా ప్రచారం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

(== బీఆర్ఎస్ లో వర్గపోరు కవితాకు కలిసి వస్తుందా..? ఫార్ట్ -2 అతి త్వరలో)