Telugu News

కాంగ్రెస్ గూటిలో చేరిన శీనన్న

రాహుల్‌తో పొంగులేటి, జూపల్లి భేటీ

0

కాంగ్రెస్ గూటిలో చేరిన శీనన్న

== రాహుల్‌తో పొంగులేటి, జూపల్లి భేటీ

== అరగంటకు పైగా రాష్ట్ర వ్యవహారాలపై చర్చ

== రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మంలో చేరిక

== అదే బాటలో జూపల్లి, దామోదర్ రెడ్డి 35మంది అగ్రనాయకులు

== జూలై2న ఖమ్మంలో భారీ బహిరంగసభ

== 3లక్షల మందితో నిర్వహిస్తామని చెప్పిన పొంగులేటి

== హాజరైన వేణుగోపాల్, రేవంత్ రెడ్డి, ఠాక్రే, ఉత్తమ్

== ‘కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో’ నినాదం ఇచ్చిన రాహుల్‌

ఆరేళ్ల ఎదురీత..ఆరునెలల ఎదురుచూపులు.. అనుక్షణం ఉత్కంఠ.. ఆయన రూట్ కోసం ఆరాటం.. ఆయనదే దారో తెలుసుకునే ప్రయత్నం.. ఏ గూటిలోకి వెళ్తారో అనే టెన్షన్.. వెరసీ అందరు ఊహించిన, సమాజం కోరుకున్న గూటికి చేరిపోయారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అధికార పార్టీని దిక్కరించి బయటకు వచ్చి పోరాటాన్ని సాగించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారంలోకి వచ్చే పార్టీతోనే కలుస్తానని, అధికారమదంతో అందర్ని తొక్కుకుంటూ పోతున్న తండ్రి కొడుకులను తరిమేసేందుకు నాలుగు అడుగులు వెనక్కి తగ్గైనా రాజకీయ పార్టీతో కలిసి పనిచేస్తానని ప్రకటించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నయ రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఆ పార్టీ ఆగ్రనాయకుడు రాహుల్ గాంధీతో ఢిల్లీలో భేటి అయ్యారు.  

ఇది కూడా చదవండి: ఖమ్మంలో కాంగ్రెస్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు

మూడు రంగుల కండువ కప్పుకునేందుకు, తల్లి సోనియమ్మ రుణం తీర్చుకునేందుకు సిద్దమైయ్యారు.. జులై 2 సుముహుర్తం నా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కిపాటు మొదలైంది.. అధికార పార్టీకి చెమటలు పట్టించే ప్రయత్నం జరిగింది.

న్యూఢల్లీ,ఖమ్మంప్రతినిధి, జూన్‌26(విజయంన్యూస్):

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు భేటీ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీని దిక్కరించి జనవరి 1న ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అంతకంటే ముందు అసమత్తితో ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గత రెండు నెలలుగా ఏ పార్టీలో చేరాలనే అంశంపై సర్వత్ర చర్చించి, చివరికి కాంగ్రెస్ వైపు అడుగులేశారు. దీంతో రెండు రోజుల క్రితం ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్ గాంధీతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమైయ్యారు. దీంతో రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈనెల 25న ఢిల్లీ వెళ్లిన పొంగులేటి, జూపల్లి వారి అనుచరులతో రాహుల్ గాంధీని కలిశారు. అప్పటికే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యరావు ఠాక్రే ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఢిల్లీలో అరగంటకుపైగా రాహుల్‌తో చర్చించారు. పార్టీలో చేరక, ఇతర అంశాలపై వారు చర్చించారు. జులై 2న ఖమ్మం రావాలని రాహుల్‌ని పొంగులేటి ఆహ్వానించారు. దీంతో ఆ రోజు ఖమ్మంలో జరిగే సభలో రాహుల్‌ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తో పాటు మరో 30మంది అగ్రనాయకులు, వందల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు   కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోనున్నారు.

== కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో అన్న రాహుల్

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో భేటి సందర్భంగా రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వందలాధి మంది నిరుద్యోగులు, తెలంగాణ వాధులు ఆత్మబలిదానాలు చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోలేదన్నారు. విద్యార్థుల బలిదానాలకు అమ్మ సోనియమ్మ, నేను చాలా బాధపడ్డామని,తెలంగాణలో  ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక్క చావు కేక కూడా వినిపించోద్దనే ఆలోచనతో కష్టమైన, నష్టమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలోనే ప్రజల సమక్షంలో చేరతా: పొంగులేటి 

అలాంటి రాష్ట్రాన్ని కుక్కలు చింపిన ఇస్తారులా సీఎం కేసీఆర్ పాలిస్తున్నారని, ఆ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అందుకే ‘కేసీఆర్ హఠావో..తెలంగాణ బచావో’ నినాదంతో ముందుకు సాగాలని, అందరు కలిసి ఐక్యంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చేంత వరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాబలం కల్గిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతలతో రాహుల్‌ భేటీ సందర్భంగా ఫొటో సెషన్‌ ఏర్పాటు చేశారు. నేతలంతా గ్రూప్‌ ఫొటో దిగిన అనంతరం రాహుల్‌తో కలిసి పొంగులేటి మరోసారి ఏఐసీసీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటి అయ్యారు. చాలా సేపు మాట్లాడారు. రాజకీయ పరిణామాలపై చర్చించారు. భవిష్యత్ రాజకీయం, రాష్ట్రంలో ఎలా పనిచేయాలనే విషయంపై ఖర్గే నేతలకు సూచించారు. పార్టీలోకి వస్తున్నందుకు ధన్యవాదాలు చెబుతూనే పొంగులేటికి, జూపల్లికి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమానికి పొంగులేటి, జూపల్లి అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

== పొంగులేటితో హాజరైన 35 మంది నాయకులు

రాహుల్ గాంధీతో భేటి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 35 మంది అగ్రనేతలు హాజరైయ్యారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, భద్రాద్రికొత్తగూడెం జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కూసుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి, గురునాథ్ రెడ్డి, తాడిపర్రి చరణ్ రెడ్డి, తుడి మేఘరెడ్డి, కురఅన్నకిష్టప్ప, ముడ్డప్ప దేస్ ముఖ్, జూపల్లి అరుణ, సూర్యప్రతాఫ్ గౌడ్, కొత్త కల్యాణ్ కుమార్, దండు నర్సింహ, ఎస్. కిచ్చరెడ్డి, గోపశెట్టి శ్రీధర్, సూర్య, ఉమ్మడి ఖమ్మం జిల్లా  నుంచి డీసీసీబీ మాజీ అధ్యక్షుడు మువ్వావిజయ్ బాబు, మహిళా కార్పోరేషన్ మాజీ చైర్మన్ మద్దినేని బేబి స్వర్ణకుమారి, భద్రాచలం బీఆర్ఎస్ ఇంచార్జ్  తెల్లం వెంకట్రావ్, ఉద్యమకారుడు, ఎస్సీకార్పోరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, అశ్వరరావుపేట బీఆర్ఎస్ ఇంచార్జ్ జారే అధినారాయణ, బానోతు విజయబాయి, కార్పోరేషన్ చైర్మన్ బొర్ర రాజశేఖర్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, బీరోలు సోసైటీ చైర్మన్ రామసహాయం నరేష్ రెడ్డి, మధిర నాయకులు కోట రాంబాబు, ఉక్కంటి గోపాల్ రావు, డాక్టర్ రాజా రమేష్, జూపల్లి రమేష్, ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, హనుమందల ఝాశ్ని రెడ్డి, రఘనాథయాదవ్, రాఘవేంద్రరెడ్డి, కొత్త మహేందర్ రెడ్డి, వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్ రాహుల్ గాంధీని కలిసివారిలో ఉన్నారు.

ఇది కూడాకాంగ్రెస్ గూటికి మడత