కందాల సహకారం తో శీనన్న ఫైట్.
*సాగునీరు రాకతో పంట పచ్చదనం.
*యావత్తు గిరిజనుల ఆనంద కృతజ్ఞతలు.
(కూసుమంచి విజయం న్యూస్ ):-
కోటి ఎకరాల మాగాణి నా రతనాల వీణ అదే… ప్రత్యేక తెలంగాణ అనే ప్రధాన ధ్యేయం సాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల సత్వరమే లక్ష్యంతో బీడు భూములను సస్యశ్యామలం చేసి రైతు కంట నీరు తుడిచేoదుకు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రం పాలేరు రిజర్వాయర్ పై ఎర్రగడ్డ తండా వద్ద భక్త రామదాసు ప్రాజెక్టు నిర్మించి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి సరఫరా ప్రారంభించారు. దీంతో జిల్లాలోని కూసుమంచి, తిరుమలాయపాలెం ఖమ్మం రూరల్ తదితర మండలాల్లోని లక్షలాది ఎకరాల భూమికి సాగునీరు అందుతోంది దాంతో రైతులు ఆనందం వెల్లివిరిసింది.
also read;-ఖమ్మం రూరల్ లో మరో మండలాన్ని ఇవ్వండి : కందాళ
ఇదిలావుండగా ఈ రబీ సీజన్లో సాగు నీటి వినియోగంలో కూసుమంచి, తిరుమలాయపాలెం మండలంలోని వివిధ గ్రామాలలో రైతుల మధ్య స్వార్థ వైఖరి తలెత్తింది . కూసుమంచి మండలం లాల్సింగ్ తండా తండా, సంధ్య తండా, తిరుమలాయపాలెం మండలంలో కాకరవాయి , పైనంపల్లి ,బచ్చోడు రాజారం, పైనంపల్లి తదితర గిరిజన తండాల్లో పాటు మహబూబాద్ జిల్లా మరిపెడ బంగ్లా ప్రాంతం గుండెపుడి, గ్రామ రైతులు భూమి సాగు ఉండగా, సాగు నీటి వినియోగ సమస్య మొదలయింది. ఆయా గ్రామాల రైతులు బోర్లు బావులు నీటితో వరినాట్లు వేశారు. ఈ క్రమంలోనే గత 30 రోజులుగా ఎండలు దాపురిం చడంతో పంటకు సాగునీరు అందడం లేదు. దాంతో తిరుమలాయపాలెం ఆయా గ్రామాలకు చెందిన రైతులు కూసుమంచి మండలం లాల్సింగ్ తండా సంధ్య తండ భూమికి సాగునీరు అందకుండా సుబ్బు లేడు , గోనె తండా వద్ద నున్న సాగునీటి సరఫరాసబ్ లైన్ వద్ద అడ్డుకున్నారు.
also read;-ప్రభుత్వ ఆఫీసుల్లో మొబైల్ వాడకాన్ని నియంత్రించండి: హైకోర్టు ఆదేశాలు
నీటి సరఫరా కాలువలపై అడ్డుకట్ట తవ్వకాలు జరిపి లాల్సింగ్ తండా సంధ్య తండ గిరిజన సాగులో భూమిలోకి నీరు అందకుండా చేశారు. దాంతో సాగులో ఉన్న భూములు పొట్ట దశకు చేరుకున్న ఎండిపోవడంతో గిరిజన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దాంతో గిరిజన రైతులు శాసన సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు .ఆలకించిన సహృదయంతో కందాల సంబంధిత అధికారుల నుంచి పూర్తి సమాచారం తెలుసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
* శీనన్న ఫైట్ .
కూసుమంచి మండలం లో లాల్సింగ్ తండా తండా గిరిజనులకు చెందిన వందలాది ఎకరాల్లో వరిపంట విషయం తెలిసి కూసుమంచి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాస్( శీనన్న) నీటి సరఫరా పర్యటించారు. శీనన్న స్వయంగా నీటి సరఫరా భూమి లలో పర్యటించారు. కాలువలు తవ్వకం అడ్డుకట్ట తో నీటి సరఫరా అడ్డుకున్న తీరును చూసి నివ్వెరపోయారు. విషయాన్ని ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి అందించారు. స్పందించి శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి సహకారంతో శీనన్న అధికారులు సమన్వయంతో సాగునీటి అడ్డంకులను తొలగించే దాంతో గత నాలుగు రోజులుగా సాగునీరు అందింది. వరి పంట కోలుకొని పచ్చ బడింది .సాగునీటి రావటంతో లాల్సింగ్ తండా సర్పంచ్ వెంకట్ సంధ్యతండ సర్పంచ్ బానోతు మమత, ఎంపీటీసీ మంగ్య, గిరిజన రైతులు, ప్రజలు, యువకులు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు.