Telugu News

రేపటి నుంచి “పాలేరు” ప్రజలతో శీనన్న 

ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన

0

రేపటి నుంచి “పాలేరు” ప్రజలతో శీనన్న 

== ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన*

==  ప్రతి గ్రామంలో అరగంట ప్రజలతో మంత్రి

==  తొలి రోజు మొత్తం 19గ్రామాల్లో పర్యటన

(ఖమ్మం రూరల్-విజయం న్యూస్):

తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నేరుగా ప్రజల చెంతకే వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని మారెమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రజల వద్దకు వెళతారని తెలిపారు. పల్లెల్లోని నివాసాల వద్ద, ప్రధాన సెంటర్ లో గ్రామస్తులతో సమావేశమై.. సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతారని దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని 19 గ్రామాల్లో తొలిరోజు పర్యటన సాగుతుందని తెలిపారు.*