Telugu News

శీనన్నను భారీ మెజారిటీతో గెలిపించుకుందాo: హర్షరెడ్డి

ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు

0

*శీనన్నను భారీ మెజారిటీతో గెలిపించుకుందాo: హర్షరెడ్డి*

– *ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు*

– *తిరుమలాయపాలెం గడపగడపకు కాంగ్రెస్ లో పొంగులేటి హర్ష రెడ్డి*

*తిరుమలాయపాలెం : నిత్యం జనం మధ్యలో ఉండే పొంగులేటి శీనన్నను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుందామని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు, కాంగ్రెస్ యువనేత పొంగులేటి హర్ష రెడ్డి పిలుపునిచ్చారు. తిరుమలాయపాలెం మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు.

ఇది కూడా చదవండి:-ఎన్నికల ప్రచారంలో పొంగులేటి కుటుంబం దూకుడు

తొలుత ప్రధాన సెంటర్లో బీఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను వివరించారు. ప్రచారంలో భాగంగా ఓ టిఫిన్ సెంటర్ వద్ద కాసేపు మంచూరియా వంట చేసి ఆకట్టుకున్నారు. స్థానికులు ఆయనతో మాట్లాడుతూ..సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక చాలా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సమస్యలున్నా పట్టించుకునేవారు లేరని విన్నవించారు. ఈ సందర్భంగా పొంగులేటి హర్ష రెడ్డి స్పందిస్తూ.. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, పొంగులేటి శీనన్న అందరి సంక్షేమం కోసం పాటుపడతారని అన్నారు. మహిళలు, రైతులు, వ్యవసాయ కూలీలు, నిరుద్యోగులకు మేలు చేసేలా కాంగ్రెస్ పథకాలు అమలవుతాయని తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందుతుందని అన్నారు. అందరూ హస్తం గుర్తుకు ఓటేసి మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ నేతలంతా బంధి పొట్లేనా..? : కాంగ్రెస్ 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గ నాయకులు చావా శివరామకృష్ణ, జెడ్పిటిసి బెల్లం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, ఎంపీటీసీ గోళ్ల లింగయ్య, కొక్కిరేణి ఎంపిటిసి అంబేద్కర్, నాయకులు తాటికొండ కిరణ్, జాల కిరణ్, డి. రవి, పోట్ల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు*.