సత్తుపల్లిలో పొటెత్తిన శీనన్న అభిమానులు
== వేలాధిగా తరలివచ్చిన జనం
== జనం రాకతో సంతోషం వ్యక్తం చేసిన పొంగులేటి
(సత్తుపల్లి-విజయంన్యూస్)
సత్తుపల్లి నియోజకవర్గంలో శీనన్న అభిమానులు పొటేత్తారు. ఆయన సత్తుపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసిన పొంగులేటి ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వేలాధి మంది శీనన్న అభిమానులు తరలివచ్చారు. సుమారు 12 వేల నుంచి 15వేల మంది వరకు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తరలివచ్చినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో సత్తుపల్లి పట్టణంలోని ఎం.ఆర్ గార్డెన్స్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం జనంతో కిక్కిరిసిపోయింది. ఒకానోక దశలో సత్తుపల్లి పురవీధులు ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు క్లియర్ చేశారు. అయితే ఈ జనసందోహాన్ని చూసిన పొంగులేటి సంతోషం వ్యక్తం చేశారు. జనసమీకరణకు కారణమైన మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబును పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అలాగే నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇది నా గడ్డ.. నా అడ్డా.. నేను పుట్టి పెరిగిన గడ్డ అంటూ పొంగులేటి సంతోషంతో ఊగిపోయారు. మీ అభిమానానికి దాసుడ్ని అవుతున్నా.. మీ పై ఈగ వాగకుండా చూసుకునే బాధ్యత నాధేనని భరోసానిచ్చారు.
ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్ మాయలమరాఠి : పొంగులేటి