Telugu News

త్వరలో శీనన్న పాదయాత్ర..?

రెండు నెలల పాటు సుదీర్ఘ పర్యటన..?

0

త్వరలో శీనన్న పాదయాత్ర..?

== ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర..?

== రెండు నెలల పాటు సుదీర్ఘ పర్యటన..?

== రూట్ మ్యాఫ్ తయారు చేస్తున్నట్లు సమాచారం..?

== జెండా లేకుండా ఏజెండాతోనే పాదయాత్ర..?

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ప్రజాబలం ఉన్న నేత.. పల్లె నుంచి పట్టణం వరకు అందరు గౌరవించే, అరాదించే నాయకుడు.. ఏ పల్లెకు వెళ్లిన..ఏ వ్యక్తిని కదిలించిన ఆయన పేరే.. ప్రతి ఊరికి ఆయన సేవా కార్యక్రమాలు ఉంటాయి.. ప్రతి ఆలయానికి ఆయన ధానం ఉంటుంది.. అవసరం ఉందంటే మొదటిగా గుర్తోచ్చే నాయకుడు ఆయనే.. అందుకే ప్రజల గుండెల్లో ఆయన అంతలా నిలిచిపోయారు. ఆయన పేరు గ్రామగ్రామాన మారుమోగుతుంది. ఆయన పేరు తెలియని వారంటే ఎవరు లేరు..? అసలు పేరు కంటే కొసరు పేరే ఎక్కువ మారు మోగుతుంది.. ఆ పేరులో అంత ప్రేమ దాగి ఉంది.. అప్యాయత, అనురాగాలు దాగి ఉన్నాయి..

ఇది కూడా చదవంఢి : తెలుగు సిని పరిశ్రమలో విషాదం..కైకాల ఇక సెలవు

ఆయనే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాంటి నాయకుడ్ని అధికార పార్టీ విస్మరించింది.. ఆయన్ను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తోంది..పట్టించుకోకుండా వదిలేస్తోంది.. దీంతో ఆయనకు, ఆయన వర్గీయులకు స్థానికంగా అవమానాలు తప్పడం లేదు.. అందుకే పార్టీ అనుమతి ఉన్నా..?లేకపోయిన ప్రజల్లో తిరుగుతున్నారు. గ్రామగ్రామాన పర్యటిస్తున్నారు.. పరామర్శలు, ఆశీర్వాదాలు, అర్థిక చేయూతనందించడం లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కర్ని అప్యాయత పలకరిస్తున్నారు.

== మరు అడుగు ముందుకు..?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా మరో అడుగు ముందుకు వేస్తున్నట్లే కనిపిస్తోంది.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు, ప్రజలతో కలిసిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నరు.  అధికార పార్టీ పట్టించుకున్న, పట్టించుకోకపోయిన  ఆయన మరో అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే అందుకు సంబంధించిన అంశాన్ని వారి అనుచరులకు చెప్పినట్లు సమాచారం. జెండా లేకుండానే ఏజెండాతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం.

ఇది కూడ చదవండి: తెలంగాణకు తెలుగుదేశం అవసరం: చంద్రబాబు

== పాదయాత్రకు శ్రీకారం..?

పొంగులేటి పాదయాత్ర చేయనున్నారా..?అతిత్వరలోనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారా..? ప్రజాలతోనే నడవనున్నారా..? ప్రజల్లోనే తన రాజకీయ భవిష్యత్ ను తెల్చుకునేందుకు సిద్దమయ్యారా..? అంటే జరుగుతున్న పరిణామాలు నిజమే అంటున్నాయి. శీనన్న అంటే ఖమ్మం జిల్లాలో, రాష్ట్ర రాజకీయాలలో తెలియని వారుండరు… వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీగా ఖమ్మం జిల్లా రాజకీయాలలో అడుగు పెట్టిన పొంగులేటి, మారుతున్న రాజకీయ పరిణామల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి తీర్ధం పుచ్చుకున్నారు.. అయితే గత ఎన్నికల నుండి పొంగులేటి రాజకీయ భవిష్యత్ పై కేసిఆర్ సీత కన్నే వేశారు. అప్పటి వరకు టిక్కెట్ వస్తుందని భావించిన పొంగులేటికి అధినేత భారీ షాక్ ఇచ్చారు.. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న నామా నాగేశ్వరరావును పార్టీలో చేర్చుకుని ఎంపీ టిక్కెట్ ఇచ్చి ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించడం పొంగులేటికి రుచించలేదు.ఆ తరువాత ఎమ్మెల్సీ, రాజ్యసభ స్థానాలకు కూడా ఆయన పేరును పరిశీలించలేదు. అనేక అవమానాలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చవి చూసిన శీనన్న గత నాలుగేళ్ళుగా అసంతృప్తి గానే ఉన్నారు… అయినా పొంగులేటి శీనన్న మాత్రం ఎక్కడా ప్రజల నుండి దూరం జరగలేదు… తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసేది ప్రజలే అనే భావనలో శీనన్న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలోనే గడిపారు… వారి కష్ఠ, సుఖాలలో శుభ, అశుభ కార్యక్రమాలలో ఓ ఇంటి వాడిలా మెలిగిన పొంగులేటి ఇప్పుడు మళ్ళీ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నరు…  ఇన్నాళ్ళు కేసిఆర్ నేతృత్వంలోని తెరాస పార్టీలో కాలం వెళ్లదీసిన ఆయన ఇప్పుడు ఓ దమ్కి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది… వచ్చే ఎన్నికలలో తనేంటో నిరూపించేందుకు, మరొక్కసారి ప్రజల మద్దతు కోరేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పయణమవుతున్నట్లు కనిపిస్తోంది.. తెలంగాణ లో ఏర్పడిన రాజకీయ సంక్లిష్ఠతలలో కూడా శీనన్న ఆజ్ఞ కోసం ఇప్పుడు జిల్లాలోని ఆయన అభిమానులు, అనుచరులు ఆసక్తి గా ఎదురు చూస్తూండటంతో అమీ తుమీకి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది… ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలలో 2 నెలలపాటు పాదయాత్ర చేసేందుకు సర్వం సిద్దమైనట్లు కూడా ఆయన అనునాయులు అభిప్రాయపడుతున్నారు. ఇటు శీనన్న కూడా ఇదే సరైన సమయంగా ప్రతి మండల కేంద్రాన్ని టచ్ చేస్తూ పాదయాత్ర పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం…

ఇది కూడా చదవండి: ఖమ్మం  రోటరీనగర్ లో క్షుద్రపూజలు

ఇప్పటికే శీనన్న తన బృందం తో పాటు అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో కూడా ప్రజలు ఆయన వైపు ఉన్నారన్న ఉత్సాహయాంజి మరింత రెట్టింపు చేసేందికు పాదయాత్రే కరెక్ట్ అనే అభిప్రాయం రావటంతో ఆ దిశ గానే ఆయన ముందుకు వెళ్తున్నట్లు పక్కా సమాచారం… ఒక వేళ శీనన్న పాదయాత్ర మొదలెడితే ఇటు ఖమ్మం, అటు తెలంగాణ రాజకీయాలలో పెనుమార్పులు సంభవిచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పొంగులేటి పాదయాత్రకు ప్రభుత్వ అనుమతి ఇస్తుందా అనేది ఇప్పుడు సంశయమే అయినా, పొంగులేటి ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నట్లు, పాదయాత్ర తో ఉమ్మడి జిల్లా చుట్టి రావాల్సిందే నంటూ ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది… అతికొద్ది రోజులలోనే పాదయాత్ర పై రోడ్ మ్యాప్ ఖరారు కానున్నట్లు సమాచారం.

== కొత్తగూడెం కేంద్రంగా బలనిరూపణ..?

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో మొదటి భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంగా బలనిరూపన చేసేందుకు యోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఏ పార్టీలో ఉన్న కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీ చేస్తే బాగుంటుందని పలువురు తన వర్గీయులు చెబుతుండగా ఆయన కూడా ఆ నియోజకవర్గంపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన మంత్రిగా పనిచేయాలనే ఆశతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే అన్ని రకాలుగా కొత్తగూడెం జిల్లా అయితే బాగుంటుందని, అందుకే భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పాదయాత్ర ప్రారంభించి కొత్తగూడెం స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పినపాకలో ఒక సభ, సత్తుపల్లిలో ఒక సభ, పాలేరు నియోజకవర్గంలో ఒక సభను ఏర్పాటు చేసి ముగింపు సభను ఖమ్మం నగరంలో నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాదయాత్ర చేస్తే రాజకీయ పరిణామాలే మారిపోయే అవకాశం ఉంది. చూద్దాం రాబోయే రోజుల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి నిర్ణయిం తీసుకోబోతున్నారు…? అసలు పాదయాత్ర చేస్తారా..?లేదా..? చేస్తే టీఆర్ఎస్ పార్టీ జెండాతో చేస్తారా..? స్వతంత్రంగా చేస్తారా..? అనే విషయాలను పరిశీలించాల్సి ఉంటుంది..

ఇది కూడా చదవండి: చంద్రబాబు ను చూస్తే బీఆర్ఎస్ కు భయం పట్టుకుంది: కూరపాటి