Telugu News

ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ రాష్ట్ర కోశాధికారిగా శోభన్ బాబు

0

ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ రాష్ట్ర కోశాధికారిగా శోభన్ బాబు

(మహబూబాబాద్- విజయం న్యూస్)

ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారిగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త ను నియమించినట్లు ఆపార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ ఎన్నికల ఇంచార్జ్ సోమనాద్ భారతి, తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరా శోభన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్బంగా నూతన రాష్ట్ర కోశాధికారి శోభన్ మాట్లాడుతూ.. రానున్న రోజులలో పార్టీ విస్తరణను రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతానని, గ్రామాలలోని వార్డుల నుండి ప్రారంభించి మండలం, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా సమాజంలో జరిగే ప్రస్తుత రాజకీయాలపై ప్రజలకు అవగాహన కల్పించి రాజకీయాల పట్ల పూర్తి చైతన్యవంతం కల్పించి పార్టీ పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం కల్పిస్తానని ఆయన తెలిపారు.