Telugu News

అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర .

నగరంలో ఆదివారం అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో శోభాయాత్రను నిర్వహించారు .

0

అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర .

(ఖమ్మం  – విజయం న్యూస్)

నగరంలో ఆదివారం అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో శోభాయాత్రను నిర్వహించారు .

శ్రీనివాస్ నగర అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుండి బయలుదేరి గాంధీ చౌక్ , కాల్వొడ్డు , పాతబస్టాండ్ , మయూరిసెంటర్ , జెడ్పీసెంటర్ , వీడియోస్ కాలనీ నుండి గట్టయ్య సెంటర్ పీఠం వరకు కోలాట నృత్యాలతో , స్వాముల భజనలతో చేరుకున్నారు .

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజ్ దేశ్ పాండే , రాంప్రసాద్ గురుస్వామి లు ఈ శోభాయాత్రను కొబ్బరి కాయ కొట్టి , హారతిచ్చి ప్రారంభించారు .

ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుత్తా చంద్రశేఖర్ , ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారపు నాగరామాచారి , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశ్వర్లు , ఖమ్మం జిల్లా అధ్యక్షులు కిశోర్ , ప్రధాన కార్యదర్శి నెల్లూరి కోటేశ్వరరావు , జిల్లా ప్రచార కార్యదర్శి హరి , కోశాధికారి ముత్తయ్య , కార్యదర్శి సుబ్బారావు , రాష్ట్ర కోశాధికారి వెంకన్న , వరంగల్ కార్యదర్శి శ్రీకాంత్ , ప్రచార కార్యదర్శి చంటి , జిల్లా సహాయ కార్యదర్శి భిక్షమయ్య , విశ్వహిందూ పరిషత్ మాజీ అధ్యక్షులు అల్లిక అంజయ్య మరియు మండల జిల్లా కమిటీల అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలలో పాల్గొని విజయవంతం చేశారు .

 

 

also read:-ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు : ** రైతు ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలు కొనసాగించాలి.