Telugu News

చంద్రబాబుకు షాక్.. 14 రోజుల రిమాండ్

జ్యుడిషియల్ రిమాండ్ చేస్తూ ఏసీబీ కోర్టు తీర్పు

0

చంద్రబాబుకు షాక్.. 14 రోజుల రిమాండ్

== జ్యుడిషియల్ రిమాండ్ చేస్తూ ఏసీబీ కోర్టు తీర్పు

 == రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశం

== హైకోర్టులో లంచ్ మోషన్ వేస్తున్నట్లు చెబుతున్న చంద్రబాబు తరుపు అడ్వికేట్లు

(అమరావతి-విజయంన్యూస్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది.. స్కిల్ డెవలఫ్ మెంట్ బడ్జెట్ విషయంలో రూ.330 కోట్ల అవినీతి అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ శనివారం తెల్లవారుజామున నంద్యాలలో విచారణ చేపట్టి, కొద్ది నిమిషాలలోనే అరెస్ట్ చేయగా, 23గంటల 55 నిమిషాల తరువాత విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబును సీఐడీ పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో రోజు మొత్తం విచారణ చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు ఆదివారం రాత్రి 7గంటలకు తీర్పు వెల్లడించారు. ఇది కూడా చదవండి:  చంద్రబాబు అర్థరాత్రి అరెస్ట్ తప్పిదమే: తుమ్మల

== చంద్రబాబు రిమాండ్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విజవాడ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు ప్రకటించారు. కోర్టు న్యాయమూర్తి హిమబిందు 10గంటల పాటు సాగిన వాదనల అనంతరం ఆమె ప్రకటన చేశారు. 14 రోజుల పాటు జుడిషియల్ రిమాండ్  విధించినట్లు  న్యాయమూర్తి తీర్పును ప్రకటించారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ మేరకు పోలీసులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, దారి పోడవునా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమైన టీడీపీ నాయకులను హౌజ్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.

== ఆందోళన చేస్తున్న టీడీపీ శ్రేణులు..సంబరాలు చేస్తున్న వైసీపీ శ్రేణులు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తున్నారు.. 14 రోజుల జుడీషయల్ రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పడంతో తెలుగురాష్ట్రాలకు చెందిన టీడీపీ శ్రేణులు, నాయకులు ఆందోళనకు గురైయ్యారు. వారు షాక్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.. 40ఏళ్ల చరిత్రలో ఎన్నడు లేని విధంగా మచ్చలేని మనిషిగా రాజకీయం చేసిన చంద్రబాబు ఒక్కసారిగా ఎన్నికలకు కొద్ది రోజుల సమయంలోనే సీఐడీ అరెస్ట్ చేయడం, ఏసీబీ కోర్టులో షాకింగ్ తీర్పురావడంతో టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. చాలా చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. ఇక మరో వైపు వైసీసీ శ్రేణులు  సంబరాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్