పాఠశాలల్లో సీసీ కెమెరాలు పెట్టాల్సిందే..?
== తప్పనసరిగా ఏర్పాటుచేస్తాం
== విద్యార్థుల రక్షణలో రాజీ లేదు
== విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(హైదరాబాద్-విజయంన్యూస్)
ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్స్ లో విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పరిగణంలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, వసతిగ్రుహాల్లో సీసీ కెమోరాలను ఏర్పాటు చేయాలని భావించింది.. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయాలని, ఇందుకు విద్యాశాఖ తగిన చర్యలు చేపట్టాలని బడుల్లో పిల్లల భద్రతపై ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రతిపాదించింది. ఏదైనా ఘటన జరిగితే పాఠశాల యాజమాన్యాలదే బాధ్యత అని, వెంటనే సదరు పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని సూచించింది. విద్యార్థుల రక్షణ, భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై ప్ర భుత్వం నియమించిన కమిటీ సమావేశం శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్చార్డీ)లో జరిగింది.
ఇది కూడ చదవండి: విషాదంలో విజేత.. కృతిక మనోదైర్యానికి లాల్ సలామ్
?విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, అదనపు డీజీపీ స్వాతిలక్రా, విద్యాశాఖ కార్యదర్శి వా కాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్యాదేవరాజన్, డీఐజీ సుమతి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ పిల్లలు గౌరవంగా ఉంటూ సురక్షిత వాతావరణంలో అభ్యసించే అవకాశాన్ని కల్పించే బాధ్యత యాజమాన్యాలదే అన్నారు. బడితోపాటు, పరిసరాలు సురక్షితమైనవిగా, రక్షణాత్మకమైనవిగా తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతా కమిటీ పలు సూచనలు చేసిందని, ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందో కూడా తెలియజేయాలని మంత్రి కమిటీ సభ్యులను కోరారు.