Telugu News

నాకంటే ఎక్కువ మెజారిటీ అందించాలి..: ఎమ్మెల్యే రాగమయి

తల్లాడలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం

0

నాకంటే ఎక్కువ మెజారిటీ అందించాలి..: ఎమ్మెల్యే రాగమయి

== తల్లాడలో కాంగ్రెస్ విస్తృత ప్రచారం

(తల్లాడ-విజయం న్యూస్)

అసెంబ్లీ ఎన్నికలప్పుడు తాను పోటీ చేయగా.. నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఆదరించి, మంచి విజయాన్ని అందించారని.. అంతకు మించిన మెజారిటీని ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డికి అందించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి పిలుపునిచ్చారు. తల్లాడ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ చేపట్టిన ప్రచార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ

ఇది కూడా చదవండి:- తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం

కొద్దికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేసిందని, ఎన్నికల కోడ్ ముగిశాక మిగతా పనులన్నీ పూర్తి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామ గ్రామాన విస్తృతంగా పర్యటించి రఘురాం రెడ్డి భారీ విజయానికి కృషి చేయాలని కోరారు.
*ఈ కార్యక్రమాల్లో..* సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, నాయకులు పసుమర్తి చందర్ రావు, అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పసుమర్తి మోహన్ రావు, మాచర్ల భారతి, మాదాల వెంకటేశ్వర్, శ్రీ రామ్ సుమంత్, రామారావు, నారపురెడ్డి, పెద్ద బోయిన శ్రీనివాస్, కృష్ణారెడ్డి, చంపసాల వెంకట్, ఏనుగు సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- హలో ఖమ్మం.. జయం మనదే: వెంకటేష్