Telugu News

చూపు తెప్పించారు.. తిర్యాణి పోలిసుల సంకల్పం …

వసుద స్వచంద సంస్థ తోడ్పటు .....

0

చూపు తెప్పించారు.. తిర్యాణి పోలిసుల సంకల్పం …

వసుద స్వచంద సంస్థ తోడ్పటు …..

బెల్లంపల్లి లయన్స్ కంటి దవాఖాన చొరవ ..

(తిర్యాణి–విజయం న్యూస్)

సర్వేంద్రియాణాం నయనం ప్రదానం అన్నారు పెద్దలు …అటువంటి చుపు సరిగాలేక తమ దైనందిన జీవితమూ మసకబారుతున్న తరుణములొ తిర్యాణి పొలీసులు వారి కంటి కి దీపం అయ్యారు ….వివరాలలోకి వెలితే
తిర్యాణి మండలం మారుముల ఆదివాసి మండలం …మెజారిటీ ప్రజలు ఆదివాసి గిరిజనులు కావడముతో ఆరోగ్యంపై సరైన దృష్టిపెట్టక ,ఆర్థిక స్థితిగతులు సరిగ లేక మెరుగయిన వైద్యానికి దూరమై చుపు మందగించి తమ దైనందిన కార్యకలాపాలు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు ….వీరి పరిస్థితిని గమనించిన తిర్యని పొలీసులు వసుద స్వచ్చందసంస్ఠ సహకారంతో బెల్లంపల్లి లయన్స్ క్లబ్ కంటి దవాఖాన చొరవతో తిర్యాణి మండలంలోని మారుముల ఆదివాసి ప్రాంతాలైన మంగి ,పంగిడిమాదర ,రోంపెల్లి ,గిన్నెదరి ,ఉలిపిట్ట గుండాల లాంటి అతి మారుముల గుడెలలో కంటి వైద్య శిబిరాలు ఏర్పటు చెయడమే కాకుండతిర్యని మండల కేంద్రములోనే శాశ్విత కంటి పరిక్ష నిర్దారణ కేంద్రంను ఏర్పటు చేసి గత ఏడాదిన్నరగా బెల్లంపల్లి లయన్స్ క్లబ్ కంటి దవాఖాన లో కంటి సర్జరి లు నిర్వహింప చేస్తున్నారు

కంటి సర్జరి అవసరమైనవారిని గుర్తించి స్వయముగ పోలీసులే వాహానాలు ఏర్పటు చేసి తొడుగా ఉండి ఆపరేషన్ అనంతరం వారిని వారి గుడెల వరకు పంపేలా ప్రత్యెక శ్రద్ద తీసుకుంటున్నారు …ఇప్పటివరకు మండలంలో 5౦౦౦ మందీ వృద్దులకు కంటి పరిక్షలు నిర్వహించి వారిలో 200 మందికి పైగా వృద్దులకు కంటి శస్త్రచికిత్సలు నిర్వహింప చెసి వారి జీవితాలలో వెలుగులు నింపారు ….తాము స్వయముగ తమపనులు తాము చేసుకోగలుగుతున్నామని కొత్తజీవితాన్ని ఇచిన తిర్యాణి పోలిసుల కు , ,వసుద సంస్త కు ,బెల్లంపల్లి లయన్స్ క్లబ్ కంటి దవాఖాన వారి కి కృజ్ఞతలు తెలుపుతున్నారు వృద్దులు …ఈ సందర్బముగా తిర్యాణి ఎస్ ఐ పి రామరావు మాట్లడుతూ మండలంలోని మారు మూల ప్రాంతాలలోని అనేకమంది మహిళలు ,వృద్దులు చుపు మందగించి అవస్థలు పడటం గమనించి వసుద స్వచ్చంద సంస్త సహకారంతో బెల్లంపల్లి లయన్స్ క్లబ్ కంటి దవాఖాన చొరవతో ఇప్పటివరకు 2౦౦మందికీ పైగా వృద్ధులకు శస్త్ర చికిత్స కొరకు పంపామని వారందరు ఇప్పుడు సర్జరి అనంతరం తమపనులు తాము చేసుకుంటున్నారని, అంతేకాకుండా వసుద ఫౌండేషణ్(USA) చైర్మన్ కడలి రాదా క్రిష్ట్న ,సంస్థ సభ్యులు ఉమ ,అదనపు ఎస్ పి ఎస్ అచ్చేశ్వరరావు సహకారంతో5౦౦ మందికి కళ్లజోళ్లు అందించామని ఆదివాసి వృద్దులకు కంటి పరిక్షలు ,సర్జరీల నిర్వహణకు తోడ్పాటు నందించిన బెల్లంపల్లి లయన్స్ కంటి దవాఖాన చైర్మన్ డా బి రాజారావు, సెక్రటరి సి వినొద్ కోశాధికారి వెంకటేశ్వర్లు కు తిర్యని మండల ప్రజల తరపున కృతఙ్ఞతలు తెలిపారు.

also read:-పేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరు చేపించడం లో ఎంపీ నామ కృషి మరువలేనిది