Telugu News

చిన్నారికి పెద్ద కష్టం దయగల దాతలు దయ చూపండి.

ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న చిట్టితల్లి.

0

చిన్నారికి పెద్ద కష్టం దయగల దాతలు దయ చూపండి.

ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న చిట్టితల్లి.

ఆర్థిక స్థోమత లేక దాతల కోసం ఎదురు చూపులు.

కెటిఆర్ సారుకు నా గోడు తెలిస్తే ఆదుకుంటారని కుమిలి పోతున్న తండ్రి.

ఓ చిన్నారి దయనీయ పరిస్థితి.

(గార్ల – విజయం న్యూస్) :-

తమ ముందే ఆటలాడుకుంటూచదువుకుంటూ అలరించే తమ చిన్నారికి ఇంతలోనే కరోనా ఇన్ని కష్టాలు తెచ్చిపెడుతుందని కలలోనైనా ఆతల్లిదండ్రులు ఊహించలేదు కరోనా వైరస్ చిన్నారి రెండు ఊపిరితిత్తులను కోలుకోలేని విధంగా దెబ్బ తీయడంతో ఆక్సిజన్ సిలిండర్ లే ఆ చిన్నారి తల్లికి ప్రాణవాయువు అందిస్తున్నాయి. తమ బిడ్డను కాపాడుకునేదెట్లా అంటూ నిస్సహాయస్థితిలో నిరుపేద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు మనసున్న మహారాజులు దాతలు తమకుమార్తె వైద్య ఖర్చుల కోసం సహకరించి తమ బిడ్డ ప్రాణాలు కాపాడి పునర్జన్మ ప్రసాదించాలని ఓ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్నా అంటారు.

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది చాలీచాలని కూలి డబ్బులతో జీవనం సాగిస్తున్నారు ఇంతలోనే వారి కుటుంబాన్ని విధి వక్రీకరించడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం కష్టాల కడలిలో కి వెళ్ళిపోయింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారి ముద్దులొలికే చిన్నారి సంఘటన కలచివేస్తుంది. ఈ హృదయవిధారకమైన సంఘటనపై విజయం తెలుగు దినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం…

వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రానికి చెందిన గోపగాని అశోక్, శ్రీవిద్య కు ఇద్దరు సంతానం. ఒక బాబు ఒక పాప కుమార్తె చైత్ర ( 9), జూన్ నెలలో కరోనా బారిన పడింది. తల్లిదండ్రులు ఆస్పత్రికిచేర్చి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ వైరస్ ప్రభావంతో చిన్నారి రెండు ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. సూర్యాపేట, హైదరాబాద్, గుంటూరుతో పాటు ఖమ్మం తదితర ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు అందించారు. ఊపిరితిత్తుల మార్పిడి ఒక్కటి పరిష్కారం అని వైద్యులు సూచించారు. ట్రీట్మెంట్ కొరకు 50 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో తమ కుటుంబానికి అంత స్తోమత లేదని ఆ కుటుంబం తీవ్ర శోకంతో ఆందోళనకు గురైంది అప్పు చేసి. కొద్ది నెలలుగా నిత్యం ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా చిన్నారికి ప్రాణవాయువును అందిస్తూ వేలల్లో ఖర్చు చేస్తున్నామని ప్రాథమిక చికిత్సకు కూడా 5 లక్షలు అవసరమవుతాయని దిక్కుతోచని స్థితిలో కన్నీటి పర్యంతమవుతూ తండ్రి అశోక్ తెలిపారు. చిన్నారి చైత్ర చాలా యాక్టివ్ గా ఉండేదని. ఆమెకు చదువుతోపాటు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టమని. తమ కళ్ళముందే ఆడుకుంటూ ఉండే పాప ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో చూస్తామని అనుకోలేదని. అంత యాక్టివ్ గా ఉండే పాప కోవిడ్ తో ఇలా అవ్వడాన్ని కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు వైద్యుల సూచన మేరకు తిరుపతి సమీపంలోని నెల్లూరులోని వైద్యశాలకు చిన్నారని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూలీనాలీ చేసుకుంటూ జీవిస్తున్న వీరికి ఇది తీవ్ర భారంగా మారింది. ప్రస్తుతానికి రోజు ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా చిన్నారి ప్రాణాలు కాపాడుతున్నామని, దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి వారి కుటుంబానికి అండగా నిలబడి సహాయాన్ని అందించగలరని బాధిత కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ కూతురి వైద్యం కోసం అయ్యే ఆర్థిక సహాయం అందించి చిన్నారి ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు దాతలు ఆపన్నహస్తం అందించాల్సిన వివరాలు.

గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ 9885551127 కు పంపించగలరు.

 

 

also read :- వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవులు ఇవ్వే..     

also read :- రోడ్డు ప్రమాద బాధితుడిని ఆదుకున్న టీ.ఆర్ఎ.స్ నేతలు.

 

 

please do subscribe like & share my channel : smiling chaithu