Telugu News

కమలం వైపు ’మడత‘ చూపు

గేరే మార్చేందుకు సిద్దమైన ‘కోరం’

0

కమలం వైపు ’మడత‘ చూపు

== గేరే మార్చేందుకు సిద్దమైన ‘కోరం’

== వారి వెంట క్యూ కట్టెందుకు సిద్దంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు

== ఇల్లెందులు మారుతున్న రాజకీయ సమీకరణాలు

==  పొంగులేటితో పయనం ఖాయం.

== బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తప్పదా..?

 (ఇల్లెందు-విజయంన్యూస్)

ఇల్లెందులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి… ఇటీవల కాలంలోనే మారుతున్న అనేక పరిణామాలు అందుకు నిదర్శనం.. ఇల్లెందులో ‘మడత’ మార్పు తప్పదనిపిస్తోంది..  కారు పార్టీ నేతలు కమలం వైపు దండు కడుతున్నట్లు అనిపిస్తోంది.. కమలం పార్టీలోకి కారుదళం చేరికలకు రంగం సిద్దమైయ్యారు.. చేరికలు ఎప్పుడనేది సమయం పై క్లారిటీ లేదు కానీ.. కారు దిగుడు ఖాయంగా కనిపిస్తోంది.. ముఖ్యనాయకత్వం ఆ నేత బాటలో పయనించేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.. ఇందుకు సంబంధించిన అంశంపై ముఖ్యఅనుచరులతో చర్చించినట్లు తెలుస్తోంది.. ఇల్లెందులో రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలపై ‘విజయం  ప్రతినిధి’ అందించే ప్రత్యేక కథనం..

ఇది కూడా చదవండి: ‘పాలేరు’ రేసులో  ‘ఆ ఇద్దరు’

ఇల్లెందు పోరాటాలకు పురిటి గడ్డ ఉద్యమాలకు పెట్టింది పేరు. విప్లవ కమ్యూనిస్టు పార్టీలు దశాబ్దాలు ఆ తర్వాత తెలుగుదేశం, కాంగ్రెస్ తిష్ట వేశాయి. ఓ పర్యాయం టిడిపి గెలిస్తే, రెండు పర్యాయాలు కాంగ్రెస్ గెలిచింది. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇక్కడ జెండా పాతిన దాఖలు లేవు. కాంగ్రెస్ నుంచి కారు పార్టీలోకి వెళ్ళారే తప్ప.. స్వయంగా గెలిచింది లేదు.. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కోరం కనకయ్య కారు పార్టీలోకి వెళ్లి, ఆ తరువాత ఎన్నికల్లో పోటీ చేసి ఘోర ఓటమి చెందాడు.. అదే బాటలో ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే హరిప్రియ తిరిగి కారు పార్టీలోకి పోయి,  మరోసారి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అయితే కారు పార్టీ ఏనాడు గెలవలేదు. రాబోయే రోజుల్లో అదే పరిస్థితి తప్పదనే ప్రచారం జరుగుతుంది.. పూర్వ కాలం నుంచి వస్తున్న సెంటిమెంట్ పునరావతమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

== ఎప్పుడు ప్రతిపక్షమేనా..?

ఇల్లెందు నియోజకవర్గం 1957లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది.. ఆ నాటి నుంచి నేటి వరకు ఏ నాడు  అధికారపార్టీ గెలిచింది లేదు. గతంలో కమ్యూనిస్టులు విజయం సాధించగా, 2009న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా టిడిపి గెలిచింది. 2014,2018లో టిఆర్ఎస్ అధికారం చేపడితే ఇల్లెందులో కాంగ్రెస్ గెలిచింది. కారణమేంటంటే..? ప్రతిసారి స్థానిక ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేతలు షాకిలిస్తుండటం గమనర్హం. ఇప్పుడు కూడా అదే పునావృతం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

== కమలం వైపు కీలక నేతలు?

కమలం వైపు కీలక నేతలు చూస్తున్నారు.. ఒకప్పుడు చక్రం తిప్పిన సీనియర్ నాయకులు అందరు ఇప్పుడు కమలం వైపు దృష్టి సారిస్తున్నారు..  నిజానికి ఇల్లెందులో బిజెపికి అంత పట్టు లేదు.. ప్రస్తుత కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో అల్ల కొల్లూలంగా  ఉంది..దీంతో ఇక్కుడున్న నాయకులంతా కమలం వైపు చూస్తున్నారు.. అందుకు కారణాలు లేకపోలేదు.. టిఆర్ఎస్ లో ఇటీవల ఐటీ,ఈడి,సిబిఐ దాడులు ఆగ్రనాయకత్వంలో గుబులు రేపుతుంది. మరో వైపు బీజేపీ రాష్ట్రంలో దూకుడు పెంచింది.. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ నాయకులు కంగారులో ఉన్నారు.. కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందుకే ఇల్లెందు బీఆర్ఎస్స్ నాయకులు పార్టీని వేడి కమలం వైపు వెళ్లేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది.

== శీనన్న వైపు నేతల చూపు                               ఇదికూడా చదవండి: జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం

ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఆయా పార్టీలో ఉన్న నాయకులందరు బీజేపీ వైపే చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. అది కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకునే నిర్ణయం పట్ల వివిధ పార్టీల నాయకులు కీలక అడుగులు వేసే అవకాశం ఉంది. ఇటీవల ఆయన రాజకీయ దూకుడును ప్రదర్శిస్తున్నారు. అవసరమైతే నా టీం ను మొత్తం గెలిపిస్తున్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన ఏ పార్టీ వైపు వెళ్తున్నారో కూడా చెప్పకనే చెబుతున్నారు.  ఈ లెక్కన చూస్తే శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడడం ఖాయంగా స్పష్టం అవుతుంది. సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరిలో తన రాజకీయ భవిష్యత్తును ప్రకటించనున్నారు. ఆయన నిర్ణయం కోసం ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కీలక నేతలు స్థానిక ప్రజాప్రతినిధులు కాచుకుని కూర్చున్నారు.

== పెద్ద ఎత్తున చేరెందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు సమాయత్నం?

బీఆర్ఎస్ ను వీడి బిజెపిలో చేరేందుకు నాయకులు పెద్ద ఎత్తున సమయతమవుతున్నారు. అదే అదే కోవలు స్థానిక ప్రజాప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీ టిఆర్ఎస్ ఎక్కువ ఊహించుకుందామని అయితే బిల్లులు విషయంలో తీవ్రంగా నష్టపరిచిందని సర్పంచులు ఎంపీటీసీలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయి. మొదట కాంగ్రెస్ వైపు చూసిన ప్రస్తుతం పీసీసీలో కొట్లాట జరుగుతుంది. అది ఎప్పుడు ఉన్న సమస్య. క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న కమలం వైపే చూస్తే బాగుంటుంది అందరు అంచనా వేస్తున్నారు.

ఇదికూడా చదవండి : ఫ్లాన్-బీ దిశగా పొంగులేటి

ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెద్దగా క్యాడర్ లేని బిజెపికి కీలక నాయకులు మారితే బిజెపి ఓటవృక్షంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి తీసుకునే నిర్ణయం పట్ల రా రాజకీయ సునామీ రానుంది. పొంగిలేటి అనుచరుడుగా కోరం కనకయ్య గత కొన్ని నెలలుగా ఇల్లందు నియోజకవర్గంలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. చనిపోయే కుటుంబాలను ఆదుకోవడం, వారికి ఆర్థిక సహాయం ఇవ్వడం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీనివాస్ రెడ్డి తీసుకునే రాజకీయం నిర్ణయం పట్లనే కనకయ్య తన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెద్దకియ పెద్ద ఎత్తున వీరిద్దరూ పార్టీ వీడితే రాజకీయ సునామీ సంచలన తుఫానుగా మారనుంది.

== మడతపై నజర్?

సీనియర్ నాయకుడు మడత వెంకట గౌడ్ గత నాలుగు సంవత్సరాలుగా సైలెంట్ గా  ఉంటున్నాడు. పలు పార్టీలు ఆయనకు ఆఫర్లు ఇచ్చిన గాని తిరస్కరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాడంతో ఇల్లెందులో ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఉత్కంఠ భరితంగా మారింది. 2014 సమయంలోనే బిజెపి పెద్ద ఎత్తున ఆయనకు ఆపర్ వచ్చింది.  కోరం కనకయ్యను వీడి వచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన మడత. ప్రస్తుతం ఆయన రాజకీయంగా మౌనంగా ఉన్నారు. మడత రీఎంట్రీ ఇస్తే పరిణామాలని ఒకేసారి మారుతాయి. కోరం, శ్రీనివాస్ రెడ్డిల వైపు నిలుస్తాడా లేదా మరోవైపు మొగ్గుతాడు అనేది వేచి చూడాలి. పలుమార్లు శ్రీనివాస్ రెడ్డి మడత వెంకట్ గౌడ్ తో సంప్రదింపులు జరిగినట్టు ప్రచారం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా మడత కోసం కాచుకొని కూర్చున్నాయి. మడత అడుగుతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారుతాయి అనడంలో సందేహం లేదు. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.