Telugu News

ఎస్ఐ మానవత్వం ఓ..నిండుప్రాణాన్ని నిలిపింది..!!

ఆత్మహత్య యత్నం చేసుకున్న వ్యక్తికి ఆయువు పోసిన నర్సింహులపేట ఎస్ఐ నరేష్..

0

ఎస్ఐ మానవత్వం ఓ..నిండుప్రాణాన్ని నిలిపింది..!!
ఆత్మహత్య యత్నం చేసుకున్న వ్యక్తికి ఆయువు పోసిన నర్సింహులపేట ఎస్ఐ నరేష్..
సత్పలితాలనిస్తున్న ప్రెండ్లీపోలిసింగ్ విధానం..

(మహబూబాబాద్ నర్సింహులపేట విజయం న్యూస్)

ఆపద సమయంలోనూ.. ఆయువు తీరిపోయే పరిస్థితి ఎదురైన సందర్భంలో ప్రతిక్షణం అత్యంత అమూల్యమైనది. ప్రాణసమానమైనది.. అలాంటి క్లిష్టకాలంలో సమయానికి స్పందించి.. అరిపోయే ప్రాణాన్ని.. తన స్నేహహస్తం అందించి ఆదుకునే గొప్ప మనుష్యులు అరుదుగా కనిపిస్తుంటారు.ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తిని ఆఖరి క్షణాల్లో కాపాడి ప్రాణబిక్ష పెట్టిన సంఘటన పరిశీలిస్తే మానవత్వం నిండిన అలాంటి..మంచి పోలీస్ అధికారి ముందు చేతులు జోడించి నిలబడాలని, గుండెనిండ ఊపిరి పీల్చుకొని సెల్యూట్ కొట్టాలని అనిపించక మానదు.. కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన మారుతి.వెంకన్న ఇంటినుండి బయటకు వచ్చి తిరుగుతూ..తిరుగుతూ.. నర్సింహులపేట మండల కేంద్రానికి నిన్న చేరుకున్నాడు. తనకు దిక్కెవరు లేరని విలపిస్తూనే ఆత్మహత్య పాల్పడాలని నిర్ణయించుకున్నాడు..

అనుకున్నదే తడవుగా తనతో తెచ్చుకున్న పురుగుల మందును తాగి.. నర్సింహులపేట శివారు బంధం చెరువు సమీపంలోని ఓ గడ్డి వాము వద్ద అపస్మారక స్థితిలో పడిఉన్నాడు. ప్రెండ్లీపోలిసింగ్ విధానం ఉపయోగపడింది ఇక్కడే…! మనం నాటిన విత్తనం అప్పడికప్పుడే ఫలాలు ఇవ్వకపోవచ్చు కాని మంచి విత్తనాలు నాటితే ఖచ్చితంగా అద్బుతమైన పలాలు..ఫలితాలు వస్తాయని బలంగా నమ్మే ఉన్నతాధికారి మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల.కోటిరెడ్డి ప్రెండ్లీపోలీసింగ్ విధానాన్ని జిల్లాలో బలంగా అభివృద్ధి చేసారు. ఆపద వచ్చినా.. అవసరం వచ్చినా పోలీసులకు నేరుగా వెళ్ళి చెప్పుకోవచ్చనే గొప్ప విశ్వాసాన్ని జిల్లాప్రజలలో నెలకొల్ప గలిన ఆ..విధానమే నర్సింహులపేటలో పలితాన్ని చూపింది. పురుగులమందు తాగి కొన ఊపిరితో కొట్టుకుంటున్న గుర్తు తెలియని వ్యక్తిని అటుగా వెలుతున్న ఓ రైతు గమనించాడు. సమస్య వస్తే పోలీస్ లకు తక్షణ సమాచారం ఇవ్వాలనే ప్రెండ్లీపోలిసింగ్ లోని మహబూబాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం అవలంబించే విధానం ఇక్కడ.. ఒక్కసారిగా.. కార్యరూపంలోకి వచ్చింది.. వెంటనే స్థానిక ఎస్ఐ లావుడ్య.నరేష్ కు సదరు రైతు నేరుగా పోన్ చేసి సమాచారం అందించారు.
తక్షణమే స్పందించాడు.. ప్రాణాలు నిలబెట్టాడు. సమాచారం అందుకున్న వెంటనే నర్సింహులపేట ఎస్ఐ నరేష్ స్పందించారు. హుటాహుటిన ఎస్ఐ నరేష్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నాడు. ఏ..మాత్రం ఆలస్యం చేయకుండా కొన ఊపిరితో.. మృత్యువుతో పోరాడుతున్న ఆ..వ్యక్తిని పోలీస్ వాహనం లోనే స్థానిక ప్రధమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. చికిత్స అందించడంతో పాటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.సకాలంలో తీసుకవచ్చారని, మరికొంత ఆలస్యం జరిగి ఉంటే ప్రాణాల మీదికే వచ్చేదంటూ వైద్యులు చెప్పడంతో…. ఆ..సమయానికే అక్కడకు చేరుకున్న బాదితుని కుటుంబసభ్యులు ఎస్ఐ నరేష్ కు చేతులెత్తి దండంపెట్టారు.
మరింత మెరుగయిన చికిత్స అందించాలనే ఆలోచనతో.. మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు..
సకాలంలో స్పందించి చికిత్స అందేలా చొరవ చూపిన మానవత్వం పరిమళించిన మంచిపోలీస్ అధికారికి మరొక్కసారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

also read :- దర్గాలో ప్రార్థనలు చేసిన – ఈటేల