Telugu News

దళితులను చితకబాదిన ఎస్ ఐ సందీప్ కుమార్

జై భీమ్ సినిమా తరుణంలో మరో సంఘటన ..

0

దళితులను చితకబాదిన ఎస్ ఐ సందీప్ కుమార్

జై భీమ్ సినిమా తరుణంలో మరో సంఘటన ..

అంబేద్కర్ అసోసియేషన్ చింతలమానేపల్లీ గ్రామ అధ్యక్షుడు నీ , విపరీతంగా కొట్టిన ఎస్సై…

మాకు న్యాయం జరగాలి అని బాధితుల ఆవేదన..

చింతలమానేపల్లీ మండల లో దారుణ సంఘటన…

చింతలమానేపల్లీ / విజయం న్యూస్

 

చింతలమానేపల్లీ మండల కేంద్రంలో శుక్రవారం రోజున సాయంత్రం తన పట్ట భూమిలో దున్నతుండగ పోలీస్ స్టేషన్ కు తీసికెళ్ళి రౌతు భవుజీ,రౌతు తిరుపతి , ఏళ్ళుములే సంతోష్ ( ట్రాక్టర్ డ్రైవర్) ను దారుణంగా జై భీమ్ సినిమా తరుణంలో విపరీతంగా
కొట్టారు … బాధితుడులు పత్రిక సమావేశం లో మాట్లాడుతూ.. నా పేరు రౌతు
బావుజీ,తమ్ముడిని పేరు రౌతు తిరుపతి ట్రాక్టర్ డ్రైవర్ సంతోష్ మేము ఎస్సీ మాల ,మాకు సర్వే నంబర్ 29 లో 4 ఎకరాల భూమి కలదు, 59/9/ఆ, 1 ఎకరం 30 గుంటలో పోలీస్ స్టేషన్ భావన నిర్మాణం కోసం బలవంతంగా లాగుకొని పోలీస్ స్టేషన్ భవనం నిర్మించారు.. ఆ విషయం హైకోర్టులో పిటిషన్ వేసాము, హైకోర్టు తీర్పు ఆ భూమి మీదే అని తీర్పు రావడం జరిగింది,మేము శుక్రవారం రోజున ట్రాక్టర్ తీసుకెళ్లి దున్ని వస్తున్న క్రమంలో ఎస్ ఐ వచ్చి ట్రాక్టర్ ను మమ్మల్ని ముగ్గురిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నేను అడిగిన ఎందుకు తీసుకుని వచ్చారు సార్ అన్ని అడగాక, నేను అంబేద్కర్ అసోసియేషన్ గ్రామ మండల అధ్యక్షుడు సార్ అని చెప్పిన కూడా.. ఏం అంబేద్కర్ రా,దేనికి అధ్యక్షుడు రా.. ఆ దున్నే భూమి మీ అయ్యా జాగీరా .. మీ అమ్మ జాగీరా..
అని నోటికి వచ్చినట్టు బూతులు పురాణాలు తిడుతూ విపరీతంగా ముగ్గురిని కూడా కొట్టిండు… మా చెంపలు వాసి, పెదవుల పై నుంచి రక్తం కారే వరకు ఘోరంగా కొట్టినాడు,మాకు న్యాయం జరగకపోతే మా సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు , సమ్మెలో , నిరాహార దీక్షలు చేపడతామని అన్ని తెలిపారు. సిడెం గణపతి మాట్లడుతూ.. బాధితులకు న్యాయం జరగకపోతే ఆదివాసుల సంఘాల తరఫున మేము కూడా మద్దతు తెలుపుతున్నాము , బాధితులకు ఎలాంటి విచారణలు జరుపకుండా కొట్టడం చాలా దారుణం, వెంటనే ఎస్ ఐ ని సస్పెండ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, ఒకవేళ న్యాయం జరగకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని ఆదివాసుల తరపున డిమాండ్ చేస్తున్నాను. దుర్గం మోతీరం ఎంపీటీసీ మాట్లడుతూ.. పోలీస్ స్టేషన్ నిర్మాణంలో ఉన్న భవనం భూమి కాదు, వేరే భూమిలో దున్ని వస్తుండగా పోలీస్ స్టేషన్కు పిలిపించి కొట్టడం దారుణమని ఎస్ ఐ ఇది సబబు కాదు.. వెంటనే కఠినమైన చర్య తీసుకోకపోతే ఎస్సీ సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సమత సైనిక్ దల్ మండల అధ్యక్షుడు గోమసే లాహాంచు , అంబేద్కర్ అసోసియేషన్ చింతలమానేపల్లీ మండల అధ్యక్షుడు డోంగ్రే నానజీ,బీజేపీ మండల వైస్ ప్రెసిడెంట్ టోమ్ర్ పోషణ, బిజెపి ప్రధాన కార్యదర్శి రమగొని తిరుపతి గౌడ్, టిఆర్ఎస్ బీసీ మండల అధ్యక్షుడు పుంజరి శ్రీమన్ నారాయణ, దంద్రే పోషణ ,జాడి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.