Telugu News

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం.

0

సాదాసీదాగా సర్వసభ్య సమావేశం.

(ఏన్కూరు- విజయం న్యూస్):-

ఏన్కూర్ లోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. అధికారులు తమ తమ శాఖల పరిధిలో జరిగిన ప్రగతి కార్యక్రమాలను వివరించారు. అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులు తమ తమ గ్రామాలలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా వ్యవసాయ సీజన్ ఆరంభం అవుతున్నందున నకిలీ విత్తనాల నిరోధానికి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరారు. మిషన్ భగీరథ ద్వారా పలు గ్రామాలకు నీటి సరఫరా జరగక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజా ప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.

ALSO READ :- ముత్తారం సర్వసభ్య సమావేశంలో పాల్గోన్న మహిళ సర్పంచ్ భర్త.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని పలువురు కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజాప్రతినిధులకు అధికారులు తెలపాలని కోరారు. అనంతరం ఆయా శాఖల అధికారులు సమాధానాలు చెప్పారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయని గ్రామాల్లో ఎవరైనా లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో నరసింహారావు తెలిపారు మిషన్ భగీరథ ద్వారా గ్రామాల్లో సక్రమ నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని సంబంధిత శాఖ అధికారి తెలిపారు .

ALSO READ :- డివిజన్లలో సమస్యలు లేకుండా చూడాలి

ఈ సమావేశంలో జెడ్ పి టి సి బాదావత్ బుజ్జి ,ఎం పి పి ఆర్ఎం వరలక్ష్మి, వైస్ ఎంపీపీ పాశం శ్రీనివాసరావు, ఎంపీడీవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.