Telugu News

ఏకకాలంలో 2 లక్షలు రైతు రుణమాఫీ: రాయల 

కాంగ్రెస్ అధికారం రాగానే గ్యాస్ సిలిండర్ ధర 500రూ.కే 

0

ఏకకాలంలో 2 లక్షలు రైతు రుణమాఫీ: రాయల 

== కాంగ్రెస్ అధికారం రాగానే గ్యాస్ సిలిండర్ ధర 500రూ.కే 

== రైతు పంటకు గిట్టుబాటు ధర

== నేలకొండపల్లి మండలంలో కొనసాగుతున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రలో టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు

== ఘన స్వాగతం పలికిన తండా వాసులు

(నేలకొండపల్లి/కూసుమంచి-విజయంన్యూస్)

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలోనే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, మాటిస్తే సీఎం కేసీఆర్ లా కాకుండా మాటతప్పేది ఉండదని టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు హామినిచ్చారు. శనివారం పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం శంకర్ గిరితండా గ్రామంలో కొనసాగుతున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై చేయి చేయి కలుపుతూ ప్రతి గడపను తట్టుతు అడుగు ముందుకేస్తున్నారు.. ఈ సందర్భంగా టిపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు ప్రతి గడపను తట్టుతూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ…

ఇది కూడా చదవండి: కోమటిరెడ్డిపై చర్య తీసుకోవాల్సిందే: సుధాకర్

బీఆర్ఎస్ పార్టీ మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారాన్ని దక్కించుకొని ప్రజల సంక్షేమాన్ని తుంగలో తొక్కా రణి టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. మూడు ఎకరాల భూమి ఇస్తామని… డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని,రైతు

రుణమాఫీ చేస్తామని మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ నిర్వర్తిస్తుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకుంటూ వారి కష్టాలకు భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో రాబోయేది,రైతు రాజ్యమని,ఉత్సాహం నింపారు,నియంత్రత్వ అవినీతి పాలన అంతమొందించే సమయం ఆసన్నమైందని ఇక కొద్ది రోజులు సమయం ఉందని వచ్చేది కాంగ్రెస్ రాజ్యమేనని భరోసానిచ్చారు. టిఆర్ఎస్ పాలనతో పాలేరు నియోజకవర్గం లో అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారని ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షేమ పథకాలు అమలుకాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రతి గడపను తట్టుతూ భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలో వస్తుంది అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని భరోసానింపారు.

ఇది కూడా చదవండి: పొలవరం ముంపు గ్రామాల సంగతేంటి..?

టిఆర్ఎస్ పాలనతో విసుకు చెందిన ప్రజల కష్టాలను తెలుసుకుంటూ యాత్రలో ముందుకు సాగుతుండగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చారు.. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ సేవాదళ్ కన్వీనర్ బచ్చలికూరి నాగరాజు ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ,బాబు, యడవల్లి నాగరాజు, సుదర్శన్,యాతాకుల శ్రీనాథ్, లంజపల్లి వీరబాబు,గోణయ,సైదారెడ్డి,జంగం లక్ష్మి నారాయణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.