Telugu News

ఎప్పుడు నుంచి ప్రభావం ?? ఎలా ఉండనుంది ??

☔⛈️బలమైన అల్పపీడనం వల్ల నవంబర్ 17 రాత్రి నుంచి 20 వరకు అతి భారీ వర్షాలు...

0

☔⛈️బలమైన అల్పపీడనం వల్ల నవంబర్ 17 రాత్రి నుంచి 20 వరకు అతి భారీ వర్షాలు…

( విజయం న్యూస్) :-

బలమైన అల్పపీడనం వల్ల నవంబర్ 17 రాత్రి నుంచి 20 వరకు ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు-తూర్పు, కడప​, ప్రకాశం జిల్లాల్లో అతిభారీ నుంచి తీవ్రమైన వర్షాలు పడనున్నాయి.

ఆల్రెడీ చెరువులు, వాగులు నీటితో నిండి ఉంది కాబట్టి భారీ వరద వచ్చే ప్రమాదం ఉంది. బలమైన అల్పపీడనంలో తీవ్రమైన వర్షాలుంటాయి, గాలులు ఏ మాత్రం ఉండదు.

నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, కడప నగరాల మీద ఎక్కువ ప్రభావం ఉండనుంది, ఈ సారి కూడ​. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ​, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలుంటాయి. కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి.

ఎప్పుడు నుంచి ప్రభావం ?? ఎలా ఉండనుంది ??
====
నవంబర్ 17 రాత్రి నుంచి నెల్లూరు జిల్లాలో వర్షాలు మొదలౌవ్వనుంది. ఆ తర్వాత 18 నుంచి చిత్తూరు, కడప జిల్లాలతో పాటుగా కోస్తాంధ్ర వ్యాప్తంగా వర్షాలు విస్తరించనుంది. నవంబర్ 19 ఈ వర్షాలు కొనసాగనుంది, ఆ రోజు అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయి. అప్పటికే కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం దక్షిణం, చిత్తూరు తూర్పు, కడప జిల్లాల్లో వరద ఉంటుంది. మరో పక్కన గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం జిల్లా దాక వర్షాలు విస్తరించనుంది.

నవంబర్ 20 నుంచి వర్షాలు మెళ్లగా తగ్గుముఖం పట్టనుంది. కానీ పూర్తిగా తగ్గవు. ఇప్పుడు ఎలా కొనసాగుతున్నాయో, అలాగే కొనసాగుతాయి. మళ్లీ అన్ని జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి.

also read :-మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఇంజనీర్.