Telugu News

సింగరేణి బాంబ్ బ్లాస్ట్ ప్రభావిత ప్రాంతాలలో ఉన్న వారికి వెంటనే ఇల్లు నిర్మించాలి.

సింగరేణి సి.ఎం.డి నీ కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర.

0

సింగరేణి బాంబ్ బ్లాస్ట్ ప్రభావిత ప్రాంతాలలో ఉన్న వారికి వెంటనే ఇల్లు నిర్మించాలి.

సింగరేణి సి.ఎం.డి నీ కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర.

(సత్తుపల్లి – విజయం న్యూస్) :-

సత్తుపల్లి జె.వి.ఆర్ ఓసి నందు బొగ్గు ఉత్పత్తి కొరకు జరిపే బాంబ్ బ్లాస్ట్ ల కారణంగా సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్, వెంగలరావు నగర్, సత్తుపల్లి మండల పరిధిలోని రేజర్ల కిష్టారం గ్రామంలలో నివసిస్తున్న వారి ఇండ్ల స్లాబ్ పెచ్చులు, గోడ పగుళ్ళు ఏర్పడి ప్రమాదకరంగా ఉన్నాయని కావున వెంటనే వారికి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ నందు సింగరేణి సి.ఎం.డి శ్రీధర్ ని వారి కార్యాలయం నందు కలిసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య.

also read :-రాత్రిళ్లు అత్యవసరాల కోసం బస్సు ఆపండి!