Telugu News

సార్ నమస్తే మేము మీ కళాశాల విద్యార్థులం…

== గుండాల కృష్ణ ను కలిసిన పలువురు అటవీ శాఖఅధికారులు

0

సార్ నమస్తే మేము మీ కళాశాల విద్యార్థులం…
== గుండాల కృష్ణ ను కలిసిన పలువురు అటవీ శాఖఅధికారులు

సార్ నమస్తే…మేము మీ ఆర్జేసీ కళాశాల విద్యార్థులం సార్…ఆనాడు మీరు మాకు నేర్పిన క్రమశిక్షణ…. మంచి నడవడిక ల వల్లే మేము ఈరోజు అటవీ శాఖ లో అధికారులు గా పనిచేస్తున్నాం సార్….అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ పలువురు ఆనాటి విద్యార్థులు కళాశాల చైర్మన్ శ్రీ గుండాల(ఆర్జేసీ)కృష్ణ ని కలిసిన సంఘటన సోమవారం ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది….ఇందుకు రాష్ట్ర మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయం వేదిక కాగా….ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…
ఖమ్మం నగరంలోని ట్రంక్ రోడ్ ప్రాంతంలో గల ఆర్జేసీ విద్యాసంస్థల్లో విద్య నభ్యసించి ప్రస్తుతం అటవీ శాఖ లో డిఎఫ్ ఓ,ఎఫ్ఆర్ఓ లు గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న శ్రీ రాధిక,శ్రీ సతీష్,శ్రీ శ్రీనివాస్,శ్రీ దీపికా,శ్రీ రేణుక  తమ ఉద్యోగ విధుల్లో భాగంగా మంత్రి  కార్యాలయం కు వచ్చారు.ఇదే సందర్భంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇంచార్జీ గా ఉన్న గుండాల(ఆర్జేసీ)కృష్ణ గారు మంత్రి ని కలిసేందుకు అక్కడికి వచ్చారు.ఇది చూసిన ఆనాటి విద్యార్థులు,ప్రస్తుత అధికారులైన వారు ఒక్కసారి గా సార్ నమస్కారం…. మేము మీ ఆర్జేసీ కళాశాల విద్యార్థులం సార్ ….అంటూ విద్యార్థులు గా మారిపోయారు.ఆనాడు చైర్మన్ గానే కాకుండా అధ్యాపకుడి గా మీరు అందించిన సలహాలు, సూచనలతో పాటు మీ ప్రోత్సాహం వల్ల నే తాము ఈ స్థాయి లో ఉన్నాము సార్…అంటూ ఆనంద భాష్పాలు కార్చారు.దీనికి కృష్ణ వారిని దగ్గర కు తీసుకొని ఓదార్చారు.ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఒక అధ్యాపకుడిగా తనకు గర్వంగా ఉంటుం దన్నారు.అనంతరం ఆయన విద్యార్థుల ప్రస్తుత కుటుంబ పరిస్థితులు, వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు వారితో ముచ్చటించి అక్కడినుండి మంత్రి ని కలిసేందుకు వెళ్లారు….

also read;-కందాళని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ కార్యకర్తలకు ఉంది