ప్రకాష్ రాజ్ కు సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్
(గజ్జెల. రాజశేఖర్ తాడ్వాయి విజయం న్యూస్):-
ములుగు జిల్లా , తాడ్వాయి మండలం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ప్రకంపనలు రేపుతుంది. ఓరుగల్లులో శుక్రవారంనిర్వహించిన రైతు సంఘర్షణ సభ సక్సెస్ అవడంతో కాంగ్రెస్ నేతలు మంచి జోష్ మీద ఉండగా , అధికార టి ఆర్ ఎస్ నేతలు రాహుల్ సభ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో నే సీఎం కేసీఆర్ కి సన్నిహి తుడిగా మెదులుతున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్ సైతం రాహుల్ నీ ఉద్దేశించి ఘాటు ట్వీట్ చేశారు.
also read;-ఏన్కూర్ లో ఉరుములు మెరుపులతో వర్షం.
తెలంగాణకు ముఖ్యమంత్రి లేరని , ఓ రాజా ఉన్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ స్పందించారు. తెలంగాణ లో దార్శనికత ఉన్న నాయకుడు కేసీఆర్ ఉన్నారని, కొంతమంది పూల్స్ నీ పెట్టుకొని మీరేం చేస్తారో చెప్పాలంటూ ఘాటు వ్యాక్యాలు చేశారు.కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ,ములుగు ఎమ్మెల్యే సీతక్క దీనిపై తీవ్రంగా స్పందించారు. అసలు నువ్వు ఎవరని ఆమె సూటిగా ప్రశ్నించారు.తెలంగాణ ఉద్యమంలో నిన్ను ఎక్కడ చూడలేదు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది నేతలే నని గుర్తుంచుకోవాలన్నారు హద్దుల్లో ఉంటే మంచిది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.