Telugu News

సీతారామ ప్రాజెక్టు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి: తుమ్మల 

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడి

0

సీతారామ ప్రాజెక్టు పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి: తుమ్మల 

== రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడి

ఏన్కూరు. మే 23(విజయం న్యూస్):

(రిపోర్టర్ -చారి)
సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఏన్కూరు సీతారామ లింక్ కెనాల్ ను ఎమ్మెల్యే మా లోతు రాందాస్ నాయక్ తో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుందని తెలిపారు.గోదావరి జలాలు వాడుకున్న మొట్టమొదటి ప్రాజెక్టు అవుతుందని అన్నారు.

ఇది కూడా చదవండి:- శోభన్ నాయక్ ఇంట్లో మంత్రి తుమ్మల తేనేటి విందు

త్వరలోనే సీతారామ ప్రాజెక్టు పనులు పూర్తయి తన జీవిత ఆశయం,కల నెరవేరు తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చి సహకరించిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మెయిన్ కెనాల్ పనులు నాలుగు పంప్ హౌస్ లతో పాటు దాదాపుగా అన్ని పనులు పూర్తి అయ్యాయని,పంపు హౌస్ ల ద్వారా లింక్ కాల్వల ను సాగర్ కెనాల్ లో కలిపి రైతులకు నీరు అందించడం మొదటి ప్రతిపాదన.ఈ ప్రతిపాదన ద్వారా నాగార్జునసాగర్ కాలువలో కలిపే ఏన్కూరు లింకు కెనాల్ పూర్తయితే ఈ ఏడాదే వైరా ప్రాజెక్టు కింద భూములు సాగులోకి వస్తాయని తెలిపారు. గత ఏడాది లాగా కృష్ణకు నీళ్లు రాకపోయినా గోదావరి జలాలతో కృష్ణ ఆయకట్టును పండించుకోవచ్చునని సూచించారు. అదేవిధంగా వైరా ప్రాజెక్టు కింద తాగునీరు కొడత లేకుండా పోతుందన్నారు.30 40 వేల ఎకరాల సాగునీరు అందుతుందని తెలిపారు.

ఇది కూడా చదవండి:- సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయటం నాజీవిత లక్ష్యం: తుమ్మల 

సాగర్ జలాలు రాకపోయినా వైరా,మధిర నియోజకవర్గాలతో పాటు,సత్తుపల్లి లంకా సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు తీసుకు పోయే అవకాశం ఉందని అన్నారు. ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించే విధంగా రైతుల తరఫున ముఖ్యమంత్రితో మాట్లాడుతానన్నారు. సీతారామ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు,మొగిలి శ్రీనివాసరెడ్డి,స్వర్ణ నరేంద్ర కుమార్, వేముల కృష్ణ ప్రసాద్, మేడికొండూరు ప్రసాద్,గుగులోత్ శోభన్ నాయక్,పాశం శ్రీనివాస్ రావు, సర్దార్ బాబు, బానోత్ రామారావు, లెనిన్, ప్రహ్లాద రావు, నవీన్, ధర్మారావు, శివకుమార్, ముక్తి వెంకటేశ్వర్లు, సాయి, మంగీలాల్, యండ్రాతి శ్రీనివాసరావు, మాలోతు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.