Telugu News

తుమ్మలపై నెటిజన్ల ప్రశంసలు..విమ్మర్శలు

ఇరిగేషన్ అధికారులతో సమీక్షించిన మాజీ మంత్రి

0

తుమ్మలపై నెటిజన్ల ప్రశంసలు..విమ్మర్శలు

== *హాట్ టాఫిక్ గా మారిన తుమ్మల, అధికారుల కలియక*

== సీతారామ ప్రాజెక్టు పనులేప్పుడైతయ్: తుమ్మల

== ఇరిగేషన్ అధికారులతో సమీక్షించిన మాజీ మంత్రి

== గండుగలపల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్ష

== పదవిలో లేకపోయినప్పటికి పరపతి చూపించారని నెటిజన్ల ప్రశంసలు

== హాట్ టాఫిక్ గా మారిన తుమ్మల, అధికారుల కలియక

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఉమ్మడి ఖమ్మంజిల్లా వరప్రదాయనిగా పేరుగాంచిన సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పెండింగ్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని ఇరిగేషన్ అధికారులను మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఇప్పటికే చాలా రోజుల సమయం గడిచిపోయిందని, ఇప్పటి వరకు పనులు పూర్తి కాకపోవడం పట్ల మాజీ మంత్రి అధికారులపై ఆసహనం వ్యక్తం చేశారు. ఆదివారం దమ్మపేట మండలంలోని గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో సీతారామప్రాజెక్టు అధికారులు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం జరుగుతున్న పనులపై సమీక్షించారు.

ఇదికూడా చదవండి: సత్తుపల్లి లో అభివృద్ధి ప్రతిపక్షాలకు కనపడదా:ఎమ్మెల్యే సండ్ర

ఈ సమావేశానికి ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ, డీఈ, ఏఈలు హాజరైయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సీతారామ ప్రాజెక్ట్ పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అధికారులను తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.  ప్రాజెక్టు పెండింగ్లో ఉన్న విషయాలను సెక్రటరీ రంజిత్ కుమార్ సేన్ కు పోన్లో తెలియజేశారు. వెంటనే స్పందించి పనులను త్వరగా పూర్తి చేస్తామని తుమ్మలకి సెక్రటరీ హామీ ఇచ్చారు. అనంతరం  ఇరు జిల్లాల కలెక్టర్ తో పోన్లో మాట్లాడిన మాజీ మంత్రి తుమ్మల ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు..పెండింగ్ పనులు జూన్ జూలై నెల వరకు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

== నెటిజన్ల ట్రోలింగ్

పనులు చేయాలంటే పదవులు అవసరం లేదు.. పట్టుదల ఉంటే చాలన్నది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి నిరూపించారు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డిపై ఓటమి చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం అధికారికంగా కానీ, అనాధికారికంగా ఎలాంటి పదవి లేదు. ప్రోటోకాల్ కూడా లేదు. అయినప్పటికి ఇరిగేషన్ జిల్లా అధికారి, డివిజన్ అధికారులు మాజీ మంత్రి ఇంటికి క్యూ కట్టడం నిజంగా ఆశ్ఛర్యమేసింది. తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ తో మాట్లాడిన అనంతరం అధికారులను పిలిపించారా..? లేదంటే సీతారామా ప్రాజెక్ట్ తన జీవితాకాంక్ష కాబట్టి అధికారులతో ఉన్న సన్నిహిత సంబంధాలతో పిలిపించారో..? ఏమో కానీ తన ఇంట్లో అధికారులతో ప్రజాదర్భార్ నిర్వహించారు.

ఇది కూడా చదవండి: “కందాళ”కు పరీక్షే నా..?

మంత్రి పిలిస్తేనే జరిగ్గా హాజరుకానీ నేటి అధికారులు మాజీ మంత్రి పిలుస్తే తన ఇంటికే వెళ్లి పనుల గురించి వివరించడం, అక్షింతలు వేయించుకోవడం చూస్తుంటే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ పార్టీలో ఎంత నడుస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఇదే విషయంపై నేటిజన్లు ఇష్టానుసారంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తుమ్మల దమ్మంటే అది అంటూ కొందరు.. అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని కొందరు, పనిపై పట్టుసాధించడం అంటే ఇదేనంటూ మరికొందరు.. ప్రజల కోసం ఏదైనా చేయగల సత్తా ఉన్న నాయకుడు తుమ్మల అంటూ మరికొంత మంది ట్రోలింగ్ చేస్తుండటంతో మాజీ మంత్రిని ఇరిగేషన్ అధికారులు కలిసి అంశం హాట్ టాఫిక్ గా మారింది. ఏ వాట్సఫ్ గ్రూపులో చూసిన, ఏ మీడియాలో చూసిన ఇదే చర్చ జరుగుతుండటం గమనర్హం.

ఇదికూడా చదవండి: “మట్టా” పయనమెటో….?