Telugu News

కాంగ్రెస్ పార్టీలోకి గండ్ర..?

0

కాంగ్రెస్ పార్టీలోకి గండ్ర…

— రేపు భూపాలపల్లికి రేవంత్ రెడ్డి రాక…

— సభా వేదిక ఏర్పాట్లను పరిశీలిస్తున్న సీతక్క. 

— బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన సీతక్క.
(భూపాలపల్లి ప్రతినిధి‌-విజయం న్యూస్):

భూపాలపల్లిలో రేపు జరగబోయే కాంగ్రెస్ పార్టీ బహిరంగ ఏర్పాట్లను పరిశీలించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రేపు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంగడి ప్రదేశంలో
కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు అని, ఈ సభలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్  రాష్ట్ర నేత గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో
చేరేందుకు సిద్ధమైంది అన్నారు.ఈ వేదికలో గండ్ర సత్యనారాయణ తన అనుచరగణంతో భారీ సంఖ్యలో పార్టీలో చేరుతున్న నేపథ్యంలో సాయంత్రం 4:30గంటలకు భూపాలపల్లి సభా వదిక వద్దకు టి పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేరుకుంటారు. రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు సీతక్క,దుద్దిళ్ల శ్రీధర్ బాబు,భట్టివిక్రమార్క,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులంతా
పాల్గొననున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఐతే  ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సభలో వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులు, గండ్ర సత్యనారాయణ అభిమానులు పాల్గొననున్నారు.సుమారు 50 వేల మంది ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు హాజరవుతారని
అంచనా.

పోటో : సబా వేదిక ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఈ కార్యక్రమంలో వేం నరేందర్ రెడ్డి, టి పి సి సి సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సిరిసిల్ల రాజయ్య మాజి ఎంపీ, నాయిని రాజేందర్రెడ్డి డిసిసి ప్రెసిడెంట్ హన్మకొండ, అయిత ప్రకాష్ రెడ్డి డిసిసి ప్రెసిడెంట్ భూపాలపల్లి, దొబ్బటి సాంబయ్య వరంగల్ పార్లమెంట్ కన్వీనర్,
పటేల్ రమేష్ రెడ్డి, టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్ , ములుగు మండలం అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా , చెన్నాజు సూర్యనారాయణ , ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,సర్పంచులు ఎంపీటీసీ లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : ‌- నిండిన స్కూల్.. నీళ్ళల్లో విద్యార్దులు

గొయ్యికి సాక్ష్యం గులాబీ జెండా..

ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? లెటెస్ట్ న్యూస్, ట్రెండింగ్ న్యూస్ చూడాలనుకుంటున్నారా..? అయితే మీ స్క్రీన్ పై కనిపిస్తున్న ‘గంట’ సింబల్ ను నొక్కండి.. ఆ తరువాత ఆల్ అని నొక్కండి.. ఎప్పటికప్పటి లెటెస్ట్ న్యూస్.. మా వార్త.. మీ ముంగింట..? ఉంటుంది.