Telugu News

దండోర యాత్రలో అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే సీతక్క.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో

0

దండోర యాత్రలో అస్వస్థతకు గురైన ఎమ్మెల్యే సీతక్క.

(ములుగు ప్రతినిధి- విజయంన్యూస్)

ములుగు శాసనసభ్యురాలు సీతక్క అస్వస్తతకు గురైయ్యారు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి పంపించారు. పూర్తివివరాల్లోకి వెళ్తే జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర యాత్రలో పాల్గొన్న సీతక్క నాలుగు కిలోమీటర్లు పాదయాత్ర చేసి తాసిల్దార్ కార్యాలయం వరకు చేరుకొని తాసిల్దార్ కు మెమోరండం ఇచ్చిన అనంతరం అస్వస్థకు గురయ్యారు.

దీంతో కార్యకర్తలు ఆమెను హుటాహుటిన స్థానిక సామాజిక వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆసుపత్రి సూపర్డెంట్ అందుబాటులో లేకపోవడంతో ప్రజాప్రతినిధులతో పాటు సీతక్క అభిమానులు, కార్యకర్తలు డాక్టర్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

also read ; పురుగుల మందు తాగి ప్రేమికుల ఆత్మహత్య యత్నం