Telugu News

ఆరు గ్యారంటీలే కాంగ్రెస్ కు శ్రీరామ రక్ష:- భట్టి

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కుచరమగీతం పాడుదాం

0

ఆరు గ్యారంటీలే కాంగ్రెస్ కు శ్రీరామ రక్ష:- భట్టి

== వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కుచరమగీతం పాడుదాం

== ములుగు జిల్లా సభలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క 

(ములుగు-విజయం న్యూస్)

కాంగ్రెస్ విజయ భేరి యాత్ర ములుగు బహిరంగ సభ

*సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కామెంట్స్*

సోనియా గాంధీ తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలో బుద్ది చెప్పాలి

తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నిండాలని రామప్ప దేవాలయంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పూజలు చేసి దేవున్ని వేడుకున్నారు.

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి దేశ సంపద ప్రజలకు చెందాలని నినదించిన మహా నాయకుడు రాహుల్ గాంధీ

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో దూకుడు పెంచిన కాంగ్రెస్

రాజుల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క, సారలమ్మ స్ఫూర్తితో నియంత పాలనకు వచ్చే ఎన్నికల్లో చరమగీతం పాడుదాం.

తెలంగాణ సంపద, వనరులు ప్రజలకు చెందాలని శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరలేదు.

తెలంగాణ సంపద వనరులు ప్రజలకు పంచడానికి శ సోనియా గాంధీ 6 గ్యారంటీలను ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రకటించిన ప్రతి గ్యారెంటీ రాష్ట్ర సంపద వనరులు ప్రజలకు పెంచడానికే

ఇది కూడా చదవండి:-;బీఆర్ఎస్ నేతలంతా బంధి పొట్లేనా..? : కాంగ్రెస్ 

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను గడప గడపకు తీసుకువెళ్లి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని కార్యకర్తలకు విజ్ఞప్తి

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇస్తాం

ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం

రైతులకు ఎకరానికి 15000 చొప్పున రైతుబంధు సాయం చేస్తాం

మహిళలకు 500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ఉచితంగా కల్పిస్తాం

ఇది కూడా చదవండి:-పిట్టలదొర మాటలు మానండి: భట్టి విక్రమార్క

అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ 4వేల రూపాయలు ఇస్తాం.

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు