ఆరుగురు సజీవదహనం
మంచిర్యాలలో ఘోర అగ్ని ప్రమాదం
(మంచిర్యాల-విజయం న్యూస్)
మంచిర్యాల జిల్లాలో అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదం జరిగింది.. ఆరుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలో మాసు శివయ్య అనే వ్యక్తి ఇల్లు దగ్ధం అయింది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు వ్యక్తులు అందులోనే మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. ఈ విషయంలో మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్ దర్యాప్తు చేపట్టారు.
Allso read:- ఎమ్మెల్సీ కవితను విచారించిన సీబీఐ
మృతుల పేర్లు
1) మాసు శివయ్య 50
2) రాజ్యలక్ష్మి (పద్మ) (శివయ్య భార్య)
3) మౌనిక 35
4) హిమ బిందు 2
5) స్వీటీ 4
6) శాంతయ్య (సింగరేణి కార్మికుడు, మృతుడి బంధువు)