Telugu News

ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నిక.

హైదరాబాద్-విజయం న్యూస్.

0

ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నిక

(హైదరాబాద్-విజయం న్యూస్) :- 

ఎమ్మెల్సీలుగా నామినేషన్ దాఖలు చేసిన కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాష్, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, వెంకట్రామి రెడ్డి , కౌశిక్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు గత కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ నోటీఫికేషన్ విడుదల చేరగా టీఆర్ఎస్ నుంచి ఆరుగురు నామినేషన్ వేయగా, వారిపై మరేవ్వరు నామినేషన్ వేయలేదు. దీంతో నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికల కమీషన్ ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు దృవీకరిస్తూ నియమకపత్రాలను అందజేశారు.

ఈ సంధర్భంగా ఆరుగురు ఎమ్మెల్సీలకు రాష్ట్ర మంత్రులు అభినంధనలు తెలిపారు. ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  శుభాకాంక్షలు తెలియజేశారు.

also read :- స్నేహితుడు కుటుంబానికి ఆర్థిక సహాయం .