Telugu News

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు స్వల్ప అస్వస్థత

** ముటాహుటిన యశోదాకు తరలింపు

0

ముఖ్యమంత్రి కెసిఆర్‌కు స్వల్ప అస్వస్థత
** ముటాహుటిన యశోదాకు తరలింపు
** సిటిస్కాన్‌, యాంజియోగ్రామ్‌ పరీక్షల నిర్వహణ
** ఎలాంటి సమస్యా లేదని తేల్చిన వైద్యులు
** ఊపిరి పీల్చుకున్న తెలంగాణ ప్రజలు
** కెసిఆర్‌ వెంటే ఉన్న కుటుంబ సభ్యులు
** యాదాద్రి పర్యటన రద్దుచేసుకున్నట్లు ఉదయమే ప్రకటన
(హైదరాబాద్‌-విజయంన్యూస్):-
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ ఎంవీ రావు స్పష్టం చేశారు. స్వల్ప అనరాగోయంతో ఆయన హుటాహుటిన యశోదకు రావడంతో పలు పరీక్షలునిర్వహించారు. ప్రస్తుతం నిలకడగా ఉన్నారని, ఆందోళన అసవరం లేదని వైద్యులు తెలిపారు. సీఎం కెసిఆర్‌కు ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్‌ చేస్తామని చెప్పారు. గత రెండు రోజుల నుంచి బలహీనంగా ఉన్నట్లు సీఎం చెప్పారు.

also read;-పంజాబ్‌లో ఓడిన సోనూసూద్‌ సోదరి

ఎడమ చేయి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు సాధారణ పరీక్షలతో పాటు ప్రివెంటివ్‌ చెకప్‌ కింద మరికొన్ని పరీక్షలు నిర్వహించామని డాక్టర్‌ ఎంవీ రావు పేర్కొన్నారు. కేసీఆర్‌కు సిటీ స్కాన్‌, యాంజియోగ్రామ్‌ పరీక్షలు చేశామన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎంవీ రావు స్పష్టం చేశారు. స్వల్ప అస్వస్థతకు గురైన కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో శుక్రవారం ఉదయం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. దీంతో ఆయనకు యాంజియోగ్రామ్‌, సిటీ స్కాన్‌తో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు యాంజియోగ్రామ్‌ పరీక్షలు పూర్తయినట్లు ఎంవీ రావు స్పష్టం చేశారు. యాంజియోగ్రామ్‌ టెస్ట్‌ నార్మల్‌గా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఎలాంటి బ్లాక్స్‌ లేవని డాక్టర్లు తెలిపారు. ఎలాంటి బ్లాక్స్‌ లేవని తెలిపారు. మరికాసేపట్లో సిటీ స్కాన్‌తో పాటు రక్త పరీక్షలు నిర్వహించనున్నారు.

also read;-జంట హత్య కేసులో ఆరుగురికి జీవిత ఖైధి

అనంతరం కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు బయల్దేరే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ గత రెండు రోజుల నుంచి వీక్‌గా ఉన్నారు. ఎడమ చెయ్యి లాగుతుందని చెప్పారు. దీంతో యాంజియోగ్రామ్‌ పరీక్షలు నిర్వహించామని డాక్టర్‌ ఎంవీ రావు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. కేసీఆర్‌ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్‌, మనుమడు హిమాన్షు, కూతురు కవిత, అల్లుడు అనిల్‌, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌ కుమార్‌తో పాటు పలువురు ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ్టి యాదాద్రి పర్యటన వాయిదా పడిరది. బిజీ షెడ్యూల్‌ కారణంగా పర్యటనలో మార్పు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి శుక్రవారం యాదాద్రిలో పర్యటిస్తారని సీఎంవో ముందుగా ప్రకటించింది.

also read;-పంచాయతీ సెక్రటరీలకు కొత్త బాధ్యతలు

కానీ, ఈ పర్యటన షెడ్యూల్‌ను తాజాగా రద్దు చేశారు. అయితే, ఈ ఏడాది యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే అవకాశం ఉందని సమాచారం. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయ పునః నిర్మాణ పనులను వేగంగా పూర్తవుతున్నాయి. యాదాద్రిలో పర్యటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఆలయ ప్రారంభానికి సమయం సవిూపిస్తున్న వేళ క్షేత్ర పర్యటనకు వెళ్తాలని భావించారు. 11 గంటలకు యాదాద్రీశుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే లక్ష్మీనారసింహుల కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. ఒకవైపు అసెంబ్లీ బ్జడెట్‌ సమావేశాలు జరుగుతుండటంతోముఖ్యమంత్రి బీజీ షెడ్యూల్‌ కారణంగా వాయిదా వేస్తున్నట్లు సీఎంవో వెల్లడించింది. అయితే అనూహ్యంగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.