*బతుకమ్మ సంబరాలలో ఆడి పాడిన “స్మార్ట్ కిడ్జ్”చిన్నారులు*
** బుల్లి బతుకమ్మ లతో అలరించిన విద్యార్థులు
(ఖమ్మం-విజయంన్యూస్)
తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఒకచోట చేర్చి ఆనందోత్సాహాల మధ్య ఆడి పాడారు. ఖమ్మం నగరంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల చిన్నారులు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఉట్టిపడే విధంగా పట్టు వస్త్రాలను ధరించి అందంగా ముస్తాబై బతుకమ్మలను తీసుకువచ్చి పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ పాటలకు చిన్నారులతో కలిసి ఉపాధ్యాయునులు సైతం బతుకమ్మ పాటలకు డాన్సులు చేస్తూ చిన్నారులను ఉత్తేజపరిచారు. సంస్కృతి సంప్రదాయబద్ధంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ, ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పండుగన రోజు ఘనంగా నిర్వహించారు.
Allso read:- ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆయనకే అవకాశం..?
తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మలను రంగురంగుల పూలతో అలంకరించి చిన్నారులు పలువురిని ఆశ్చర్యానికి గురి చేశారు. చిట్టి చిట్టి అడుగులతో ముత్యాలు చేస్తూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు తామే నిలువెత్తువద్దమని నిరూపించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ *చింతనిప్పు కృష్ణ చైతన్య* మాట్లాడుతూ పూర్వకాలం నుండి బతుకమ్మ పండుగ ఎంతో విశిష్టత కలిగిందని,తీరొక్క పూలతో మహిళలు అందంగా అమర్చి అందరూ ఒక చోట చేరి సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసే విధంగా కాపాడుకునే విధంగా ప్రాచీనం నుండి ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుందని, పిల్లలకు తల్లిదండ్రులు చరిత్రను తెలియజేయాల్సిన అవసరం ఉందని పండుగల మీద అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ మంచి గుర్తింపు తీసుకొచ్చిందని, దీనిలో భాగంగానే చరిత్ర నేర్పేందుకు సంస్కృతిని తెలియజేసేందుకు మా పాఠశాల యందు ప్రతి కార్యక్రమాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతామని ఆయన అన్నారు.
Allso read:- నేలకొండపల్లిలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ *చింతనిప్పు సుకన్య* పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.