లోఖమ్మం మార్కెట్ లో తుమ్మల ప్రచారం
== రైతులు సమస్యలను అడిగితెలుసుకున్న మాజీ మంత్రి
(ఖమ్మం -విజయం న్యూస్)
ఖమ్మం నగరంలోని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఉదయం ప్త్రచారం నిర్వహించారు. త్రీటౌన్ ప్రాంతానికి చెందిన నాయకులు కొప్పెర ఉపేందర్, ఆనంద్, పండు, పట్టాభి నరసింహారావు గారు, దీర్శాల. వెంకటేశ్వర్లుతో కలిసి సందర్శించిన మాజీ మంత్రి, ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల. నాగేశ్వరావు మిర్చి,పత్తి మార్కెట్ లో రైతులు వ్యాపారుల తో సమావేశమైయ్యారు.
ఇది కూడా చదవండి:- ఇందిరమ్మ రాజ్యం కోసం…! ఒక్కొక్కరూ ఒక్కో శీనన్న కావాలి…!!
రైతుల అభిప్రాయాలను తెలుసుకున్న తుమ్మల మార్కెట్ అభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేయాలో వ్యాపారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
వ్యవసాయం గూర్చి అవగాహన ఉన్న వారినే మార్కెట్ చైర్మన్ గా నియామకం చేశా నేడు అలా లేదు
మున్నేరు పై ప్రకాష్ నగర్ వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం తో మార్కెట్ ప్రగతి బాటలో నడుస్తుంది
ఎన్.ఎస్.పీ కాలువ ఆక్రమించుకొని కాలేజ్ బీల్డింగ్ లు కట్టింది ఎవ్వరో ఖమ్మం ప్రజానీకం కు తెలుసు
భూ కబ్జాలు అక్రమ కేసులు నమోదు తో ఖమ్మం లో అరాచక పాలన
మార్కెట్ తరలింపు పై తప్పుడు ప్రచారం చేస్తూన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్కెట్ ఆధునిక సౌకర్యాల తో అభివృద్ధి చేస్తాం
ఇది కూడా చదవండి:-:ఖమ్మం కాంగ్రెస్ వలసల జోరు.. బీఆర్ఎస్ కు హడల్
రైతులకు దడవాయి లకు మార్కెట్ లో విశ్రాంతి సౌకర్యాలు కల్పిస్తాం.
కొత్త బస్టాండ్ నిర్మాణం కేవలం ఎక్స్ప్రెస్ సర్వీసుల కొరకు.
ఆర్టీసీ పాత బస్టాండ్ లీజ్ ల పేరుతో ఆక్రమించాలని చూస్తున్నారు.
ప్రజలు వ్యాపారస్తులు పోరాటంతోనే పాత బస్టాండ్ నిలిచినది.
కాంట్రాక్టర్ల ను బెదిరించి కమీషన్ల కోసం నాసిరకం పనులు చేశారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా రైతులకు రైతు కూలీలకు మేలు జరుగుతుందని అన్నారు.
సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పంపిస్తే మీ ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వచ్చాను.
కాలేజ్ ఉన్న స్థలంలో పత్తి మార్కెట్ ఏర్పాటు చేయించిన ఘనత మాదే.
నా జీవిత లక్ష్యం చెక్ డాంలు రహదారులు బ్రిడ్జిలో నిర్మించడమే. తద్వారా రైతులందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారని నా కోరిక.
ఇది కూడా చదవండి:- పాలేరుకు ‘తుమ్మల’.. ఖమ్మంకు ‘పొంగులేటి’..?
ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్కెట్ తొలగించే సమస్య లేదు. ఈ మార్కెట్ నే అన్ని హంగులతో ఆధునికరిస్తాం.
ఈ కార్యక్రమంలో, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మానుకొండ.రాధాకృష్ణ, పట్టణ అధ్యక్షులు జావిద్, సాదు.రమేష్ రెడ్డి, బిక్కసాని.నాగేశ్వరావు, బాణాల.లక్ష్మణ్, బూర్ల. లక్ష్మీనారాయణ, మహిళా అధ్యక్షురాలు సౌజన్య, రమాదేవి, సోమిశెట్టి.వెంకటేశ్వర్లు, బాదే. వెంకన్న, నల్లమోతు. లక్ష్మయ్య, మిక్కిలినేని. నరేంద్ర, తిలక్, జంగం.భాస్కర్,తదితర సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.