Telugu News

*ఎస్ఐ కొట్టింది అంటూ మనస్తాపంతో ఒకరి మృతి…*

మండలంలోని గొడిసీర్యాల గోండుగూడా గ్రామానికి చెందిన మాడవి నాగరాజు (19) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

0

*ఎస్ఐ కొట్టింది అంటూ మనస్తాపంతో ఒకరి మృతి…*

(గొడిసీర్యాల – విజయంన్యూస్)
మండలంలోని గొడిసీర్యాల గోండుగూడా గ్రామానికి చెందిన మాడవి నాగరాజు (19) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే మండలంలోని గోడీసీర్యాల గోండు గూడా గ్రామంలో ఈనెల 13న వివాహ నిశ్చితార్థం కార్యక్రమం ముగించుకొని గ్రామానికి వస్తున్న క్రమంలో ఆదివాసులు గ్రామ సమీపంలో వారి సాంప్రదాయ ప్రకారం మద్యం సేవించి గ్రామానికి వస్తున్న క్రమంలో దస్తురాబాద్ ఎస్సై జ్యోతి మనీ విధి నిర్వహణలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా మద్యం సేవించి ద్విచక్ర వాహనంపై రావటం ఎస్ ఐ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయగా మద్యం తాగడం రోజు కావడంతో మద్యం తాగి వాహనం నడప వద్దు అని కూడా గ్రామానికి చెందిన మాధవి నాగరాజును కొట్టింది దీంతో మనస్తాపం చెందిన నాగరాజు అదే రోజు రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కుటుంబీకులు వెంటనే అతనిని జన్నారం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు.

also read :- వైఎస్ షర్మిల మీద తేనెటీగల దాడి

ఎస్ఐ కొట్టడం వల్లనే ఆదివాసి మాధవి నాగరాజు మృతి చెందాడని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు దీంతో తుడుందెబ్బ నాయకులు గ్రామానికి చేరుకొని ఆందోళన నిర్వహిస్తున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖానాపూర్ సి ఐ అజయ్ బాబు ఆధ్వర్యంలోగట్టీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

also read :- తెలంగాణ వడ్లు కొనల్సిందే.. తేల్చుకునే వస్తాం.. మంత్రి పువ్వాడ.