Telugu News

సోమేషా..ఆనందమేందుకు..? :భట్టి

అక్కడ లేని ఆనందం..ఇక్కడేందుకుంది..?

0

సోమేషా..ఆనందమేందుకు..? :భట్టి

== అక్కడ లేని ఆనందం..ఇక్కడేందుకుంది..?

== భూములు కొల్లగొట్టేందుకు ఆనందముందా..?

== రైతులను ముంచినందుకు ఆనందమోస్తుందా..?

== విలేకర్ల సమావేశంలో సోమేష్ కుమార్ పై మండిపడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

== తెలంగాణ ప్రజలను ఇంకెంతకాలం పీక్కు తింటారు

== పోయేకాలం వచ్చిందన్నా సీఎల్పీ నేత భట్టి

(కొందుర్గు/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఏపీలో ఉద్యోగం చేతకాదని, ఆరోగ్యం సహకరిస్త లేదని వీఆర్ఎస్ తీసుకున్న మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు  తెలంగాణ చీఫ్ అడ్వైజర్ పదవిని ఎలా నిర్వహిస్తారో అర్థం కావడం లేదని, అక్కడ లేని ఆనందం ఇక్కడేందుకు వస్తుందో తెలియడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా కొందుర్గుకు చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమేశ్ కుమార్ కు ఆంధ్రాలో ఉద్యోగం చేయడానికి లేని ఆనందం తెలంగాణలో ఏమున్నదని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: కర్టాటక సీఎం ఎంపిక నిర్ణయం హైకమాండ్ దే

తెలంగాణలోని భూములను స్వాహా చేయడంలోనే ఆనందం ఉన్నదా..? అని ప్రశ్నించారు.  మాజీ చీఫ్ సెక్రటరీగా, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సిసిఎల్ఏ కమీషనర్ గా పనిచేసిన సోమేశ్ కుమార్ కోర్టు కేసుల్లో ఉన్న భూములను సైతం రాజీ చేయించి ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసిన చరిత్ర ఉన్నదన్నారు. వందల సంవత్సరాల నుంచి పేదలు కాపాడుకుంటూ వచ్చిన తెలంగాణలోని భూములను సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం వాటిని మాయం చేశారని ఆరోపించారు. ధరణి తీసుకొచ్చి జాగిర్దారు, అన్క్లైన్డు, అవే క్యూ లో ఉన్న భూముల సమాచారం తీసుకొని ఆ భూములను పార్ట్- బి లో పేర్కొని ప్రభుత్వ పెద్దలు హాంఫర్ట్ చేసే విధంగా సహకరించిన గొప్ప మేధావి సోమేశ్ కుమార్ అని దుయ్యబట్టారు. సబ్బండ వర్గాలు కొట్లాడి కోరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది పేదల భూములు గుంజుకోవడానికేనా? సోమేష్ కుమార్ కు పదవి ఇచ్చిందని ప్రశ్నించారు. కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులు గబ్బిలం లాగా పదవులను పట్టుకొని వేలాడటం దేనికి? అంటూ ప్రశ్నలను సందించారు.

ఇది కూడా చదవండి: కర్ణాటకలో క్యాబినెట్ కు ముహుర్తం ఖారారు..ఎప్పుడంటే..?

తెలంగాణ ప్రజలను ఇంకెంతకాలం పీక్కు తింటారని, మీ సమయం పూర్తైయ్యిందని, తెలంగాణ ప్రజల సమయం, ఇందిరమ్మ రాజ్యం సమయం రాబోతుందన్నారు. కొత్త వారికి ఉన్నత పదవులు అవకాశం కల్పించడానికి రిటైర్డ్ అయిన ఉద్యోగులు గౌరవంగా తప్పుకోవాలని సూచించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ను బొంబాయికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీ కంపెనీకి 30 సంవత్సరాలు లీజు ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దలకు వెసలుబాటు కల్పించింది మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమారులేనని ఆరోపించారు. హైదరాబాద్ చుట్టు మిగులు ఉన్న భూములను చీఫ్ సెక్రటరీగా సోమేశ్ కుమార్ వచ్చిన తర్వాత ధరణి తీసుకురావడం భూములను గుంజుకోవడం మంత్రి కేటీఆర్ వాటిని బహుళ జాతి కంపెనీలకు దారా దత్తం చేయడం జరుగుతున్నదన్నారు. విదేశీ పెట్టుబడులు తీసుకొస్తామని అమెరికా, దుబాయ్ వెళ్లిన కేటీఆర్ అక్కడ బహుళ జాతి కంపెనీలతో వాటాలు మాట్లాడుకుని తెలంగాణకు వచ్చి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్లతో సమావేశమై మిగులు భూములు, గత ప్రభుత్వాలు పేదలకు పంచిన భూముల జాబితా సేకరించి వాటిని బలవంతంగా గుంజుకొని బహుళ జాతి కంపెనీలకు కట్టబెడుతున్న కెటిఆర్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన పేదల భూములను ఎన్ని వేల ఎకరాలు గుంజుకున్నది, వాటిని ఎవరెవరికి దారా దత్తం చేసిన వివరాలను శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలన్నారు.

ఇది కూడా చదవండి: పొంగులేటి.. ఊ.. అంటారా..? ఊఊ అంటారా..?

తెలంగాణ ఏర్పడి 10 ఏండ్లు కావస్తున్న కృష్ణానదిలో నీటి వాటా తేల్చకుండా దద్దమ్మల నిద్రపోతున్న బిఆర్ఎస్ ప్రభుత్వం, కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎంత? ఇప్పటివరకు వాడుకున్నది ఎంత? ఇంకా వాడుకోవాల్సింది ఎంత? తేల్చకపోవడం దుర్మార్గమన్నారు. గత ప్రభుత్వాలు డిజైన్ చేసిన ప్రాజెక్టులకు రీ డిజైన్ చేయడం, ఎస్టిమేషన్ పెంచడం ,ఆ పనులు కాంట్రాక్టర్ల కప్పగించడం, బిల్లులు డ్రా చేయడం, అందులో కమిషన్లు పొందే మమకారం నీళ్లు ఇచ్చేదానిపై ఈ పాలకులకు లేకపోవడం శోచనీయమని అన్నారు. కృష్ణానది నీటి వాట తేల్చకపోవడంపై సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని సూచించారు. కృష్ణా నదిపై సంగమేశ్వర్ వద్ద

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు నీటి ఎద్దడి పొంచి ఉన్నదన్నారు. రోజుకు 03 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువెళ్తే తెలంగాణ కృష్ణ తీర ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదన్నారు. మన నీళ్లు మన భూములు కాపాడుకోవడం కోసం మరో పోరాటానికి సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందని అన్నారు.