Telugu News

సోమ్లా నాయక్ కు మెరుగైన వైద్యం అందించాలి: పొంగులేటి 

వైద్యులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు

0

సోమ్లా నాయక్ కు మెరుగైన వైద్యం అందించాలి: పొంగులేటి 

== వైద్యులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు

== అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షునికి శ్రీనివాస రెడ్డి పరామర్శ*

(హైదరాబాద్-విజయం న్యూస్):

ఇటీవల అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు బాణోతు సోమ్లా నాయక్ ను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం రాత్రి పరామర్శించారు. ఆయన మనవడు బాణోతు ఉత్తేజ్ నాయక్, కుటుంబ సభ్యులను అడిగి సోమ్లా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వైద్యులను ఆదేశించారు.*