నేడు హైదరాబాద్ కు సోనియా, రాహుల్ గాంధీ
== నేటి నుంచి హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు
== 17న తుక్కగూడ లో విజయభేరి సభ
== తరలిరానున్న ప్రియాంక గాంధీ, ఖర్గే, మన్మోహన్, చిదంబరం కాంగ్రెస్ ఆగ్రనేతలు..
(హైదరాబాద్-విజయం న్యూస్):
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అగ్ర నేతలు తరలిరానున్నారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సి డబ్ల్యూ సి) సమావేశాలు హైదరాబాద్ కేంద్రంగా రెండు రోజులపాటు జరగనున్నాయి ఈ సమావేశాలకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, సీనియర్ నేత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిదంబరం తదితర ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ పార్టీ కి తుమ్మల గుడ్ బై
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడైన తర్వాత తొలిసారిగా ఆయన అధ్యక్షతన హైదరాబాద్‌లో ఈరోజు నుంచి రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనుంది..
ఈ భేటీలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చించి, అందుకు సంబంధించిన వ్యూహాన్ని కూడా రూపొందించనున్నారు.
ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ విజయోత్సవ ర్యాలీ చేపట్టి, తెలంగాణకు ఐదు హామీలను కూడా ప్రకటించబోతోంది. మల్లికార్జున్ ఖర్గే గత నెలలోనే కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించారు.
ఇది కూడా చదవండి:- ప్రసవానికి పోవాలంటే వాగు దాటాల్సిందేనా..?
ఈరోజు జరిగే ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నారు. అదే సమయంలో రెండు రోజుల పాటు జరిగే ఈ సభకు దేశం నలుమూలల నుంచి చిన్నా, పెద్ద కాంగ్రెస్ నేతలు తరలిరావడం ప్రారంభించారు
== 17న విజయభేరి సభ
సిడబ్ల్యుసి సమావేశాలు అనంతరం ఈనెల 17న హైదరాబాదులోని తుక్కుగూడ లో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో విజయభేరి సభను నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ పార్టీ కి తుమ్మల గుడ్ బై
ఈ సభకుపార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరుకానున్నారు. అదే సమయంలో పార్టీలోకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో సోనియాగాంధీ సమక్షంలో చేరనున్నారు. ఈ సభకు దేశం నలుమూలల నుంచి చిన్నా, పెద్ద కాంగ్రెస్ నేతలు తరలిరానున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.గ్రామీణ స్థాయి నుంచి జన సమీకరణ జరుగుతుంది.