Telugu News

తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ: రాహుల్

తెలంగాణ భవిష్యత్ మార్చేది సోనియాగాంధీ

0

తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ: రాహుల్

== తెలంగాణ భవిష్యత్ మార్చేది సోనియాగాంధీ

(హైదరాబాద్ –విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియాగాంధీ అని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. హైదరాబాద్ లోని తుక్కగూడెం లో జరిగిన విజయభేరి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో చాలా పోరాటం జరిగిందన్నారు. యువకులు, కార్మికులు, కర్షకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేశారన్నారు. తెలంగాణ ప్రజల అకాంక్ష కోసం, ఉద్యమకారుల బలిదానాలను ఆపాలనే ఆలోచనతో 2012న డిసెంబర్ లో సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు మాటిచ్చారని, ఆ మాట ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చాలా కష్టపడ్డారని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ దెబ్బతింటుందని తెలిసినప్పటికి సోనియాగాంధీ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆరు గ్యారంటీ స్కీమ్ లను ప్రకటించిన రాహుల్ గాంధీ

సోనియాగాంధీ మాట ఇస్తే నిలబెట్టుకుంటారని, ఎంత కష్టమొచ్చిన సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని అన్నారు. బలం లేకపోయినప్పటికి మీ అకాంక్ష ,ప్రజల కలను నేరవేర్చిన ఘనత సోనియాగాంధీదేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు, కిసాన్, ప్రజలు, కార్మికుల కోసం, బలహీన వర్గాలు, మహిళల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశామని అన్నారు. గత తొమ్మిదిన్నర ఏళ్లలో చిన్నచిన్న వ్యాపారుల, మైనార్టీలకు, రైతులకు ఎవరికి న్యాయం జరగలేదు. మేము తెలంగాణ ఇస్తామని మాటిచ్చినం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు.