Telugu News

యువతకు ఎస్పీ మంచి సూచన

మంచిబాటలో నడవాలని..

0

యువత చెడు మార్గలను అనుసరిస్తే కఠిన చర్యలు

👉గంజాయి, గుట్కా అక్రమ రవాణా చేసే వారి పై నిగ.
👉యువతకు వారి తల్లి తండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన sp సునీల్ దత్

👉యువత చెడు మార్గాలను అనుసరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

(బుర్గంపహాడ్ -విజయం న్యూస్ )
బుర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గాంధీ నగర్ కు చెందిన ఆరుగురు యువకులు ఇటీవల మోతీ గూడెం నుంచి హైదరాబాద్ కు అక్రమంగా గంజాయి తరలిస్తుండాగా వరంగల్ పరిధిలో ని ఖానాపూర్ పోలీస్లకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో పట్టుబడ్డ యూవకులు గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నారు అని తెలిసి వారి ఇళ్ల వర్ధకు వెళ్లి ఏ గ్రామంలో వున్నా యూవకులు శనివారం అయన కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జల్సాలకు అలవాటు పడి అక్రమ పద్దతి లో డబ్బు సంపాదించలి అన్న ఆలోచన తో చెడు మార్గాలను అనుసరిస్తూ జీవితలు నాశనం చేసుకో వద్దని అయన సూచించారు. పిల్లలు చిన్నపాటి నుంచే ప్రయోజాలకులుగా తీర్చిదిదే భాద్యత తల్లి తండ్రుల మీద వుంది అని హిత వు పలికారు. తల్లితండ్రులు పిల్లలను చెడు స్నేహలకు వెళ్లనీయకుండా వారికీ భాద్యతలు గుర్తొన్చే విధంగా మంచి అలవాటలను నేర్పిచాలని కోరారు
గాంధీనగర్ లో ఉండేటటువంటి యువతకు చెడు మార్గాలను అనుసరించడం వద్దని చెడు మార్గాలు అనుసరించడం సరైన పద్ధతి కాదని మీ వల్ల మీతో స్నేహం చేసే యువకులు కూడా చెడు మార్గాలను అనుసరించే అవకాశం ఉందని కాబట్టి యువత మేల్కొని మంచి పద్ధతులలో నడవాలని కౌన్సిలింగ్ ఇచ్చారు చెడు మార్గాలను అనుసరిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఎవరైనా నిషేధించబడ్డా గంజాయి గుట్కా లాంటి వి అక్రమంగా రవాణా చేస్తే వారిపై పూర్తి స్థాయిలో కట్టిన చర్యలు తీసుకుంటామని అక్రమాలు చేసే వారు ఎవరైనా ఉన్నట్లయితే అట్టి విషయాన్ని స్థానిక ఎస్సై గాని లేకుంటే మా కైనా సరే సమాచారం అందించినట్లు అయితే ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి కె ఆర్ కె ప్రసాద్ ఎస్ ఐ జితేందర్ ట్రైనీ ఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

also read :- తహసీల్దార్ ఆఫీస్ లో ఏడ్చిన మహిళ