Telugu News

సీఎం కేసీఆర్ పై మండిపడిన ఈటేల.

ధాన్యం కొనం అని బీజేపీ ఎప్పుడు చెప్పిందని ప్రశ్నించిన ఈటెల.

0

సీఎం కేసీఆర్ పై మండిపడిన ఈటేల.

ధాన్యం కొనం అని బీజేపీ ఎప్పుడు చెప్పిందని ప్రశ్నించిన ఈటెల.

(హుజురాబాద్ – విజయం న్యూస్):-

👉దేశ వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూసిన ఫలితం హుజూరాబాద్​ ఉప ఎన్నిక అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా.. అంతిమంగా ప్రజలు ధర్మాన్నే గెలిపించారని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం చేయకుండా.. ప్రతి గింజా కొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ ​చేశారు.

ఈ మేరకు హనుమకొండ జిల్లా కేంద్రంలో ఈటల మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ధాన్యం కొనబోమని కేంద్రం చెప్పడం లేదని.. ఉప్పుడు బియ్యానికి బదులుగా ముడి బియ్యం ఇవ్వమని చెబుతోందని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మొండి వైఖరికి పోకుండా.. రైతులకు అన్యాయం జరగకుండా. ధాన్యం కొనుగోళ్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల సీఎం కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు.

ప్రత్యామ్నాయ పంటల వైపు  సాంకేతికత సాయంతో.. నూకలు రాకుండా ధాన్యాన్ని ఆడించే మిల్లులు అందుబాటులోకి తీసుకురావాలని ఈటల అన్నారు. వరి వేస్తే ఉరి అని బెదిరింపులకు పోకుండా.. వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడి ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సూచనలు చేయాలని అభిప్రాయపడ్డారు. రాగులు, సజ్జలు, కొర్రలకు ప్రజల నుంచి డిమాండ్ ఉందని.. వాటిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.బెదిరింపులకు పాల్పడ్డారుదళిత బంధు అమలు చేయడానికి నిధులు లేకనే.. ఆ పథకాన్ని ఆపడానికి తనపై తప్పుడు కథనాలు సృష్టించారని. ఈటల ఆరోపించారు హుజూరాబాద్​ ఎన్నికల్లో తెరాసకు ఓటేయకపోతే పింఛను, సీఎం రిలీఫ్​ ఫండ్​ తదితర పథకాలు ఆగిపోతాయని బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. పసుపు, కుంకుమ ఇచ్చి.. ఓటర్లతో ప్రమాణం చేయించుకున్నారని దుయ్యబట్టారు.

పోలీసుల సాయంతో హుజూరాబాద్​ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్​.. వందల కోట్లు ఖర్చు పెట్టారు. పోలీసు అధికారుల సాయంతోనే ఎస్కార్టు వాహనాల్లో డబ్బులు పంచారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వారి కుటుంబ సభ్యుల ఓటర్ల జాబితా తీసుకున్నారు. పింఛను రాదని వృద్ధులను బెదిరించారు. ఇన్ని కుట్రలు చేసినా చివరికి ధర్మమే గెలిచింది. ఇకనైనా ప్రజల మీద మమకారంతో.. వారి సంక్షేమం గురించి ఆలోచించాలి. వరి కుప్పల మీద అన్నదాతలు ప్రాణాలు కోల్పోతున్నారు భేషజాలకు పోకుండా రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలి.

ఈటల రాజేందర్​, హుజూరాబాద్​ భాజపా ఎమ్మెల్యే చివరకు ధర్మమే గెలిచింది..తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి.. సీఎం కేసీఆర్​ హుజూరాబాద్​ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రభుత్వ, కాంట్రాక్టు, గ్రామ స్థాయి ఉద్యోగులను ప్రచారంలో వినియోగించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించి వారి కుటుంబీకుల ఓట్లను కొనుక్కున్నారని దుయ్యబట్టారు. వినని వాళ్లను బదిలీ చేశారని ఆరోపించారు. దేశ చరిత్రలోనే పోలీసు ఎస్కార్టు వాహనాల్లో డబ్బులు పంపిణీ చేశారని విమర్శించారు.

తెరాస ఎన్ని కుట్రలు పన్నినా.. హుజూరాబాద్​ ప్రజలు ధర్మానికే ఓటేశారని ఈటల స్పష్టం చేశారు.

also read :-చోరీలకు పాల్పడుతున్న భార్య భర్తలు అరెస్ట్.