Telugu News

చెల్పూరు లో ఈటలకు ప్రత్యేక పూజలు.

ఘనంగా స్వాగతం పలికిన మానుకొండూరు బీజేపీ నాయకులు, అర్చకులు

0

చెల్పూరు లో ఈటలకు ప్రత్యేక పూజలు.

== ఘనంగా స్వాగతం పలికిన మానుకొండూరు బీజేపీ నాయకులు, అర్చకులు

(కరీంనగర్ -విజయంన్యూస్)

హుజురాబాద్ శాసనసభ్యులు ఈటల రాజేందర్, ప్రయాణిస్తున్న వాహనానికి,నిన్న మానకొండూరు మండలం లలితాపూర్ గ్రామం వద్ద, ప్రమాదం జరిగింది.చీకటి పడడంతో ఎదురుగా వస్తున్న గొర్రెల మందను చూసి డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనక వస్తున్న ఎస్కార్ట్ వాహనం ఈటల వాహనానికి ఢీ కొట్టడంతో వాహనం స్వల్పంగా దెబ్బతింది. భగవంతుని దయవల్ల, ఎటువంటి హాని జరగలేదు. అందుకుగాను హుజురాబాద్ నియోజకవర్గం చెల్పుర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు ఈటేల రాజేందర్ ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. చెల్పూర్ సర్పంచ్ మహేందర్ ఆత్మీయ స్వాగతం పలుకగా నియోజకవర్గ ముఖ్య నేతలు హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి దీర్ఘాయుష్షుతో ఉండాలని పూజారులు ఈటెలకు ఆశీర్వచనం ఇచ్చారు.

ఇది కూడా చదవండి:  ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా  ‘షర్మిళ’