Telugu News

మేడారంకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

★ రవాణా సౌకర్యాలపై మంత్రి అజయ్ సమీక్ష

0

మేడారంకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

★ రవాణా సౌకర్యాలపై మంత్రి అజయ్ సమీక్ష

మేడారం జాత‌ర నిర్వ‌హ‌ణ‌కు రవాణా సౌకర్యాలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖైరతాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో రవాణా మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి భేటీ అయ్యారు.

మేడారం జాతర సమీపిస్తోన్న నేపథ్యంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే ఈ మహాజాతర కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడనుందని వివరించారు. హైదరాబాద్​ నుంచి మేడారం ప్రత్యేక బస్సు సేవలు ఈనెల 16 నుంచి అందుబాటులోకి వస్తాయని, ఎంజీబీఎస్ నుంచి ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వెల్లడించారు.

also read :-మృతి చెందిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి: భట్టి విక్రమార్క

హైదరాబాద్ డిపో-1 సూపర్ లగ్జరీ బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతాయని పేర్కొన్నారు. మేడారం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరుతాయని వెల్లడించారు. హైదరాబాద్ -2 డిపో బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 7 గంటలకు మేడారం నుంచి సాయంత్రం 4 గంటలకు బయల్దేరుతాయని చెప్పారు. పికెట్ డిపో బస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 8 గంటలకు… మేడారం నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతాయని తెలిపారు.

ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ వెబ్ సైట్​లో, టీఎస్ఆర్టీసీ యాప్​లో బస్సులను బుక్ చేసుకునే వెసలుబాటు కల్పించామన్నారు. మేడారం ప్రత్యేక బస్సులకు రూ.398లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమీక్ష సమావేశం లో ఆర్టీసీ ఛైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జానార్, రవాణా మరియు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.