Telugu News

సోనియమ్మతోనే ప్రత్యేక తెలంగాణ సాకారం: జావిద్

అమరుల ఆకాంక్షకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పాలన

0

సోనియమ్మతోనే ప్రత్యేక తెలంగాణ సాకారం: జావిద్

👉🏻 అమరుల ఆకాంక్షకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పాలన

👉🏻 భూ కబ్జాలు, రియల్టర్లకు ప్రభుత్వ పదవులు

👉🏻 బీఆర్ఎస్ దుర్మర్గానికి 9 ఏండ్లు

👉🏻 పీసీసీ సభ్యులు,నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

👉🏻 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలపు

👉🏻 సోనియమ్మ చిత్ర పటానికి పాలభిషేకాలు చేయాలి

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఆల్ ఇండియా కాంగ్రెస్ అధినేత్రి, తెలంగాణ తల్లి సోనియమ్మతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని పీ సీ సీ సభ్యులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ అన్నారు.హత్ సే హత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం రఘునాధపాలెం మండలంలో పరికలబోడు తండా,లచ్చిరం తండా, ఎన్ వి బంజరలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్ల నాటి కల కాంగ్రెస్ పార్టీ తోనే అదీ అమ్మ సోనియమ్మతోనే సాధ్య పడిందని అన్నారు.

ఇది కూడా చదవండి: స్వరాష్ట్రం సంక్షేమంతో వర్ధిల్లాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యం: జావిద్

అమరవీరుల కుటుంబాలను, అమరవీరులను అవమానపరిచి కేసీఆర్ భూ కబ్జాదారులకు, రియల్టర్లు ప్రభుత్వ పదవులు కట్టబెట్టారని ఎద్దేవా చేసారు.  అమరవీరుల ఆత్మ బలిదానాలను గౌరవించిన అమ్మ  సోనియమ్మ ప్రత్యేక తెలంగాణ తో తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని భావించి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదని తెలిసినప్పట్టికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత సోనియమ్మది అని అన్నారు. నేడు కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కి తన బినామీలకు తన కుటుంబానికి పదవులు కట్టబెట్టి తెలంగాణ ప్రాంత వాసులను దోపిడీ చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిదులను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేసే నీచ సంస్క్రుతి కి తెర లేపరని విమర్శించారు. నేడు రాష్ట్రంలో కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బ్రిటిష్ మరియు నిజం దొరల పాలన గుర్తు వస్తుందని అన్నారు. ఈ రెండు ప్రభుత్వాలను తరిమి కొట్టాలంటే కాంగ్రెస్ కు బలం చేకూర్చాలని అన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల గెలుపుతో మోడీ బ్రిటిష్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని త్వరలోనే దేశం విడిచి పోవడం ఖాయం అని అన్నారు.

ఇది కూడా చదవండి: *ఉపాధి కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు:జావిద్

అంతే కాకుండా రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎన్నికల భయం పట్టుకుందని ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నరని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ సోనియమ్మ చిత్ర పటానికి పాలభిషేకాలు చేసి అమ్మకు కృతజ్ఞతలు తెలపాలని పిలుపునిచ్చారు.రఘునాథ పాలెం మండల అధ్యక్షుడు భూక్యా బాలాజీ, మారం కరుణాకర్ రెడ్డి, కొంటేముక్కుల నాగేశ్వరరావు, ఏలూరి రవికుమార్, నరేష్,వసీం, యశ్వంత్, నాని, పరికలబొడు తండా గ్రామ కాంగ్రెస్ నాయకులు మూరలీ, బాన్సి లాల్, నరేష్, హనుమ, భాష, మదన్ లాల్, చందర్, నరేష్, మోతీలాల్, వెంకట్రామ్, హేమ్మల తది తరులు పాల్గొన్నారు……..