ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు స్పీడ్ పెంచండి:ఎమ్మెల్యేెలు
సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష సమావేశంలో కోరిన ఎమ్మెల్యేలు కందాళ, సండ్ర
ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు స్పీడ్ పెంచండి:ఎమ్మెల్యేెలు
== సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష సమావేశంలో కోరిన ఎమ్మెల్యేలు కందాళ, సండ్ర
== ఖమ్మం కలెక్టర్ కు లేఖ రాసిన గంగుల కమలాకర్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లాలో అకాలవర్షాల వల్ల ధాన్యం తడిసే అవకాశం ఉందని, తక్షణమే కొనుగోలు విషయంలో వేగం పెంచాలని రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు కోరారు. ఎన్ఎస్పీ పరిధిలోని వరి సాగు అధికంగా దిగుబడి వచ్చిందని, వాతావరణం బాలేకపోవడం వల్ల వర్షాలకు ధాన్యం తడిసే అవకాశం ఉందని, రైతులు ఇబ్బందులు పడకముందే ధాన్యంను కొనుగోలు చేయాలని, అలాగే తడిసిన ధాన్యంను కూడా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యేలు మంత్రి గంగుల కమలాకర్ ను కోరారు.
ఇది కూడా చదవండి: పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలి: కందాళ
ధాన్యం కొనుగోలుపై హైదరాబాదులోని సచివాలయ ఛాంబర్ లో సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ రవీందర్ సింగ్, పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, సంస్థ జీఎం రాజారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, సివిల్ సప్లై శాఖ అధికారుల నిర్వహించిన సమీక్షా సమావేశం జరిగింది. పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సత్వర ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సమావేశంలో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ గోదాముల్లో ధాన్యం దిగుమతికి కాళీ లేనందున ప్రైవేటు గోదాములలో ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసుకుని దిగుమతి చేసి రైతుల ఎకౌంట్లో తగు నగదు జమ చేసేటట్లు ఏర్పాట్లు చేసేటట్లు సమీక్షించారు.
ఇది కూడా చదవండి: నా అన్నవాళ్లకు అండగా ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం జిల్లాలోని మిల్లులకు మించి ధాన్యం ఉండటంతో ఇతర జిల్లాలకు మిల్లులకు ధాన్యాన్ని కేటాయించేటట్లు నిర్ణయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు వీలుగా బాయిల్డ్ చేయడానికి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
== జీవో విడుదల చేసిన మంత్రి గంగుల
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మంత్రి గంగుల కమలాకర్ కు వినతి చేయగా, వెంటనే స్పందించిన మంత్రి గంగుల కమలాకర్ ఖమ్మం కలెక్టర్ కు లేఖ రాస్తూ జీవో విడుదల చేశారు. ఖమ్మం జిల్లాలో ఉన్న ధాన్యంను మొత్తం కొనుగోలు చేసి, ప్రైవేట్ గోదాములను తీసుకుని వాటిలో నిల్వ చేయాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: దమ్ముంటే సత్తుపల్లి లో పోటీ చేసి గెలవాలి: ఎమ్మెల్యే సండ్ర