Telugu News

తెలంగాణలో ఆధ్యాత్మిక   సౌరభం:నామా

ఆధ్యాత్మిక పర్యాటకంలో    అద్భుత ప్రగతి

0

తెలంగాణలో ఆధ్యాత్మిక   సౌరభం:నామా

🔶 అన్ని మతాలకు చిరునామా తెలంగాణా

🔶ఆధ్యాత్మిక పర్యాటకంలో    అద్భుత ప్రగతి

🔶ఆధ్యాత్మికతలో దేశానికే ఆదర్శం

🔶ధర్మ పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి

🔶యాదాద్రి తెలంగాణాకు కీర్తి కిరీటం

🔶 రామప్ప మన ఎనలేని సంపద

🔶నేటి అధ్యాత్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

👉 బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు

ఖమ్మం, జూన్ 20(విజయంన్యూస్):
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణా రాష్ట్రం ఆధ్యాత్మిక పర్యాటక రంగంలోనూ అద్భుతమైన ప్రగతిని  సాధిస్తోందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు  పేర్కొన్నారు. బుధవారం జరగనున్న ఆధ్యాత్మిక దినోత్సవాన్ని  విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం ఇక్కడపత్రికలకు  ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక నిధులతో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసు కుందన్నారు. కామన్ గుడ్ ఫండ్ పధకం  కింద దూపదీప నైవేద్యం ,  ఆలయాలు అభివృద్ధికి, నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా  తెలంగాణా దేశానికే ఆదర్శవంతమైన ఆధ్యాత్మిక, ధార్మిక కేంద్రంగా విలసిల్లు తోందని అన్నారు. సీఎం కేసీఆర్ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలోని అన్ని ప్రముఖ మతాలకు తెలంగాణా రాష్ట్రం చిరునామాగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ నాయకత్వంలో అబ్బురపర్చే అభివృద్ధి: నామా

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం సీఎం కేసీఆర్ యుద్ధప్రాతిపదికన చేపట్టిన అతి పెద్ద లక్ష్యాలు రెండు కాగా వాటిలో ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్, రెండోది యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహాస్వామి టెంపుల్ పునర్నిర్మాణం అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిస్తే, కేసీఆర్ కు యాదాద్రి కీర్తి కిరీటంలా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నారు. దేవాలయాల పునరుద్ధరణ, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతో తెలంగాణ ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని ఎంపీ నామ అన్నారు. ములుగు జిల్లాలోని సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని చారిత్రక కట్టడంగా యునెస్కో ప్రకటించడంతో అంతర్జాతీయ టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా మారిందని నామ అన్నారు. విశ్వనగరమైన హైదరాబాద్ కు  నలువైపులా టెంపుల్ టూరిజం అపూర్వ రీతిలో అభివృద్ధి జరిగి సరికొత్త పర్యాటకులను ఆకర్షించే అద్భుత నిర్మాణాలు తెలంగాణాకు అదనపు ఆకర్షణగా మారాయన్నారు. అద్భుత రీతిలో పునర్ని ర్మితమైన యాదాద్రి లక్ష్మి నరసింహాలయం, కొత్తగా నిర్మించిన బుద్ధవనం అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం, ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం శాంతి కన్హా ఆశ్రమం, హైదరాబాద్ కు  దక్షిణ మార్గంలో శంషాబాద్ ముచ్చింతల్ వద్ద నిర్మించిన అతిపెద్ద రామానుజుల వారి విగ్రహం, యునెస్కో ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించిన రామప్ప దేవాలయాలు దేశ, విదేశాల్లోని హిందువులతో పాటు, సంస్కృతీ, సాంప్రదాయాలను ఇష్టపడే ఆధ్యాత్మిక పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని తెలిపారు.

ఇది కూడా చదవండి: రోడ్డుపై చెత్త ఏంటి..? మంత్రి పువ్వాడ ఆగ్రహం..

ఇప్పటికే ఈ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలను పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారని నామ చెప్పారు. ఇటీవల హైదరాబాద్ లో 9 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన బ్రాహ్మణ సదన్ ప్రముఖ ధార్మిక కేంద్రంగా మారిందని చెప్పారు. మహమ్మ దీయులకు చెందిన మక్కా మసీద్ తోపాటు ఎన్నో ప్రఖ్యాతమైన మసీదులు, దర్గాలు, కుతుబ్షాహీ సమాధులు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్నాయని చెప్పారు. సుప్రసిద్ధ మెదక్ చర్చి తోపాటు అద్భుత పాశాత్య నిర్మాణ శైలితో నిర్మించిన హైదరాబాద్ లోని అత్యంత పురాతన చర్చిలు నిత్యం సందర్శకులతో సందడిగానే ఉంటాయన్నారు. హిందూ, బౌద్ధ, జైన, పారసీ ఇలా, అన్ని మతాలకు చెందిన చారిత్రక కట్టడాలు కలిగిన రాష్ట్రంగా పర్యాటకపరంగా దేశంలోనే తెలంగాణాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో మొదటిసారి పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మించిన అతిపెద్ద దేవాలయం యాదాద్రి కావడం విశేషమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో యాదాద్రిగా మారిన యాదగిరిగుట్ట రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు. ఈ పునర్నిర్మిత ఆలయాన్ని సందర్శించేందుకై దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని అన్నారు. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ వద్ద  బౌద్ధవనం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. పూర్తిగా బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే ఈ అంతర్జాతీయ బౌద్ధ కేంద్రం ప్రపంచశ్రేణి బుద్ధపర్యాటక ప్రాంతంగా ఇప్పటికే ప్రాచుర్యం పొందింద న్నారు. ముచ్చింతల్ లో సర్వాంగ సుందరంగా నిర్మించిన రామానుజుల వారి సమతా మూర్తి విగ్రహం కూడా తెలంగాణకు ప్రత్యేక ఆకర్షణగా మారిందని నామ నాగేశ్వర రావు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: పొంగులేటికి ఆ సీట్లు ఓకే..?