శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం
ఎస్ ఐ కట్టా వెంకటరెడ్డి.
(హుజూర్ నగర్-విజయంన్యూస్)
శారీరక మానసిక అభివృద్ధికి క్రీడలు తప్పనిసరి అని ఎస్ ఐ వెంకటరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని గ్రీన్ ఉడ్ పాఠశాలలో గురువారం జరిగిన స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.విద్యార్థులు ప్రదర్శించిన పరేడ్ ను వీక్షించి ఆటల పోటీలను ప్రారంభించారు.
also read :-ఉత్తరప్రదేశ్ అందుకే గెలిచిందా..?
అనంతరం ఎస్ ఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ నేటి యువతరం ఆటలు వదిలేసి చరవాణి చుట్టూ తిరుగుతూ కాలం గడుపుతున్నారని, ప్రతి విద్యార్థి మైదానంలో ఆటలు ఆడడం ద్వారా శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చెందుతరాని అన్నారు.విద్యార్థులు ఇళ్లను వదిలిమైదానాల వైపు పరుగులు తీయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ తుమ్మ సరితా మరెడ్డి,కరస్పాండెంట్ కృష్ణారావు ప్రిన్సిపల్ రాజారెడ్డి,పి ఈ టి రామకృష్ణ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.