Telugu News

చండ్రుగొండ మండలంలో విత్తన షాపుల్లో ఆకస్మికంగా తనిఖీలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే బైండోవర్ కేసులు నమోదు

0

చండ్రుగొండ మండలంలో విత్తన షాపుల్లో ఆకస్మికంగా తనిఖీలు
– నకిలీ విత్తనాలు విక్రయిస్తే బైండోవర్ కేసులు నమోదు
– వ్యవసాయ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు

చండ్రుగొండ మే 29 ( విజయం న్యూస్)

(రిపోర్టర్ -శివనాగిరెడ్డి)
మండల పరిధిలోని చండ్రుగొండ, రావికంపాడు, పోకలగూడెం, గ్రామాల్లోని విత్తన షాపులను బుధవారం వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాపు యజమానులకు పలు సూచనలు చేశారు.. ఈ సందర్భంగా అగ్రికల్చర్ ఏవో జి వినయ్ మాట్లాడుతూ.. విత్తన డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలన్నారు. రైతులకు విత్తనాలకు సంబంధించిన బిల్లును కచ్చితంగా ఇవ్వాలన్నారు. రైతులు కోలుగోలు చేసిన విత్తన వివరాలను ఆ బిల్లుపై తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. రైతులు బిల్లు తీసుకునే సమయంలో బిల్లుపై తప్పనిసరిగా సంతకం చేసి ఆ బిల్లును తమ వద్దే ఉంచుకోవాలన్నారు. అనుమతులు లేని విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు. సబ్ ఇన్స్ స్పెక్టర్ మాచినేని రవి మాట్లాడుతూ… ప్రభుత్వం సూచించిన విత్తనాలనే విత్తన డీలర్లు విక్రయించాలన్నారు. అలా కాదని నకిలీ విత్తనాలను ఎవరు విక్రయించిన అట్టి వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం పాటు చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే షాపుల యజమానుల ప్రమేయం లేకుండా ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి గ్రామాల్లో విత్తనాలు అమ్మితే వెంటనే పోలీసు వారికి లేదా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. రైతులు కూడా విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, సిబ్బంది పాల్గొన్నారు.