పది ఫలితాల్లో తెలంగాణ శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం.
== అభినందనలు తెలిపిన పాఠశాల ప్రిన్సిపల్
ఖమ్మం ప్రతినిధి జూన్ 30( విజయం న్యూస్):-
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో తెలంగాణ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ ఫలితాలలో 408 మంది విద్యార్థులు అత్యధిక జీ.పీ.ఏ 10/10 మంది విద్యార్థులు సాధించారు. 914 మంది విద్యార్థులు 9.8 జి.పీ. ఏ పైగా సాధించారు.1887 మంది విద్యార్థులు 9.5 జి.పి.ఎ పైగా సాధించారు.2846 మంది విద్యార్థులు 9.0 జి.పి. ఎ పైగా సాధించారు. ఏ 1 గ్రేడులు సాధించిన విద్యార్థులు, మ్యాథ్స్లో 2998, సైన్స్ లో 1874, సోషల్ లో 2284 సబ్జెక్టుల వారీగా మొత్తం ఏ -గ్రేడులు సాధించిన విద్యార్థులు 19466 విద్యార్థుల సత్తా చాటారు. ఈ సందర్భంగా తెలంగాణ శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ మా విద్యార్థులు ఐ.ఐ.టి తో పాటు స్టేట్ సిలబస్ లో కూడా అత్యున్నత ప్రతిభ కనబరిచారు అని అన్నారు. ఆన్లైన్ బోధనలో కూడా ఇంతటి ఫలితాలు సాధించడం అనేది ఒక్క తెలంగాణ శ్రీ చైతన్య కు మాత్రమే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ విద్య మాట్లాడుతూ ఎన్ టి ఎస్ సి, ఆర్ ఎమ్ ఓ, నాసా, ఏ ఒలంపియాడ్ పోటీ పరీక్షలైన చైతన్య విద్యార్థులే ముందుంటారని అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహ శర్మ మాట్లాడుతూ సి. ఐ పీ ఎల్ , సి బ్యాచ్ మరియు టెక్నో కరిక్యులమ్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ అన్ని పోటీ పరీక్షలలో విజయం సాధిస్తూ 10వ తరగతి ఫలితాలలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జీ.పీ.ఏ సాధించిన విద్యార్థులను వాళ్ల తల్లిదండ్రులును పాఠశాల యాజమాన్యం,అధ్యాపక బృందం అభినందించారు.
ఇది కూడా చదవండి:- కేంద్రంపై నిప్పులు చెరిగిన సీతక్క