కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముచ్చింతల్ లోని సమతామూర్తి
(శ్రీ రామానుజాచార్యులు) విగ్రహాన్ని సందర్శించారు.
ఆశ్రమానికి విచ్చేసిన అమిత్ షాకు చిన్నజీయర్ స్వామి తదితరులు హార్దికస్వాగతం పలికారు. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది మహోత్సవాలకు అమిత్ షా పంచెకట్టు, తిరునామంతో వచ్చారు. ఆశ్రమంలోని విశేషాలను ఆయనకు చిన్నజీయర్ స్వామి వివరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించారు. శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య సందేశం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. మనుషులంతా ఒక్కటేనని రామానుజాచార్యులు చాటిచెప్పారని, సమతామూర్తి భావి తరాల వారికి స్ఫూర్తి మంత్రం అని వెల్లడించారు. ఇక్కడికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అమిత్ షా తెలిపారు. సనాతన ధర్మం అన్నింటికి మూలం అని వివరించారు. సమతా మూర్తి విగ్రహ ఏకతా సందేశాన్ని అందిస్తోందని వివరించారు.